ఇండస్ట్రీ లో కొందరు హీరోల పేర్లు చెబితే కొన్ని సినిమాలు అలా గుర్తుకు వస్తుంటాయి అలాంటి వాళ్లలో హీరో శ్రీకాంత్( Srikanth ) ఒకరు ఈయన చేసిన సినిమాలు అప్పట్లో మంచి సక్సెస్ లు అందుకున్నాయి.ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమాలు ఆయన ఎక్కువగా తీశారు.
ఆయన చేసిన ప్రతి సినిమా మినిమం గ్యారంటీ అనే విధంగా ఉండేది అందుకే అప్పట్లో ఆయన్ని ప్రొడ్యూసర్ల హీరో అని కూడా పిలిచేవారు…అప్పట్లో ఆయన చేసిన ఒక మూడు సినిమాలు మాత్రం ఇప్పటికి ఎవర్ గ్రీన్ సినిమాలు అనే చెప్పాలి అవేంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం.
ఎస్వీ కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) డైరెక్షన్ లో శ్రీకాంత్ హీరోగా చేసిన ఆహ్వానం సినిమా( Aahvaanam ) అయితే అప్పట్లో విపరీతంగా ఆడిందని చెప్పాలి.
ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు కూడా చాలా బాగుంటాయి.అయితే ఒక భర్త అనేవాడు ఎలా ఉండాలి, డబ్బు ఆశ ఉంటె మనిషి చివరికి ఎలా మారుతాడు అనే కాన్సెప్ట్ లో వచ్చిన సినిమా ఇది ఇందులో శ్రీకాంత్ కి జోడిగా రమ్య కృష్ణ( Ramya Krishna ) నటించింది.ఈమె కూడా చాలా బాగా నటించి తన నటన తో ఆ పాత్ర కి ప్రాణం పోసిందని చెప్పాలి…రమ్యకృష్ణ అంటే అప్పటి వరకు చేసిన పాత్రలు వేరు ఈ సినిమాలో చేసిన పాత్ర వేరు కంప్లిట్ గా ఒక పద్ధతి అయినా భార్య ఎలా ఉంటుంది అనేది మన కండ్లకి కట్టినట్టు గా తన నటన తో చేసి చూపించింది…ఈ సినిమా ఇప్పుడు చూసిన కూడా అసలు బోర్ కొట్టదు…
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సందడి సినిమా కూడా మంచి విజయం సాధించింది.శ్రీకాంత్ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో ఇది ప్రథమ స్థానం లో ఉంటుందనే చెప్పాలి.ఈ సినిమా చిన్న సినిమాల్లో చాలా పెద్ద హిట్ సినిమాగా అప్పట్లో చరిత్రలో సృష్టించిందనే చెప్పాలి.ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి కీరవాణి మ్యూజిక్ ఇచ్చిన సినిమాలన్నింటిలో ఈ సినిమా ఆల్బమ్ మొదటి ప్లేస్ లో ఉంటుంది.ఒక్కో పాట ఒక్కో అద్భుతం అనే చెప్పాలి…
శ్రీకాంత్ కెరియర్ లో వచ్చిన మరో అద్భుతమైన సినిమా తాజ్ మహల్ ముప్పలనేని శివ డైరెక్షన్ లో డాక్టర్ డి రామానాయుడు గారు నిర్మాత గా ఈ సినిమా వచ్చింది.అప్పట్లో ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది.దింట్లో పాటలు కూడా చాలా బాగుంటాయి.ఆ పాటలు ఇప్పుడు విన్న కూడా అసలు బోర్ కొట్టదు.ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎమ్ ఎమ్ కీరవాణి వాళ్ళ చెల్లెలు అయినా ఎమ్ ఎమ్ శ్రీలేఖ…ఈ సినిమా తోనే పాటల రచయితగా చంద్రబోస్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు…
.