బాలయ్య కెరియర్ లో సూపర్ హిట్ అయినా సినిమాల్లో నరసింహనాయుడు( Narasimha Naidu ) సినిమా ఒకటి ఈ సినిమాకి బి గోపాల్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విషయానికి వస్తే మెయిన్ రోల్ లో సిమ్రాన్ నటించింది.సెకండ్ హీరోయిన్ గా ప్రీతీ జింగానీ నటించింది అయితే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ పాత్ర కోసం అంటే సిమ్రాన్ చేసిన పాత్ర కి సౌందర్య ని( Soundarya ) హీరోయిన్ గా తీసుకుందాం అందుకున్నారట.
ఎందుకంటే ఈ సినిమా ప్రకారం హీరోయిన్ పాత్ర హీరోకి భార్య గా ఉండే పాత్ర కావడం తో సౌందర్య అయితే ఈ పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనుకున్నారట కానీ సౌందర్య అప్పుడు ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా ఒక 3 నెలల వరకు డేట్స్ మొత్తం ప్యాక్ అయి ఉండటంతో ఇక చేసేదేం లేక వేరే హీరోయిన్ ని ఎవరిని తీసుకుందాం అని అనుకుంటుంటే, అప్పటికే బాలయ్య తో సమరసింహా రెడ్డి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సిమ్రాన్ ని హీరోయిన్ గా పెడుదాం అని డైరెక్టర్ బి గోపాల్ అనడం తో సిమ్రాన్ ని ఈ సినిమా కోసం తీసుకున్నారు.సిమ్రాన్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించి మెప్పించిందనే చెప్పాలి.
అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిందనే చెప్పాలి.ఈ సినిమాతో బాలయ్య సిమ్రాన్ జోడికి మంచి మార్కులు పడ్డాయి.ఇక సినిమా తరువాత బాలయ్య హీరోగా వచ్చిన సీమసింహం సినిమాలో కూడా సిమ్రాన్ నే( Simran ) హీరోయిన్ గా తీసుకున్నారు.అలా బాలయ్య సిమ్రాన్ జంటకి సక్సెస్ ఫుల్ పెయిర్ అనే గుర్తింపు వచ్చింది.
ఆ తరువాత బాలయ్య, వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో చేసిన ఒక్క మగడు సినిమాలో కూడా సిమ్రాన్ నే హీరోయిన్ గా తీసుకున్నారు…
.