తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే తాజాగా ఈమె నటించిన శాకుంతలం(Shaakunthalam)సినిమా విడుదలకు సిద్ధమవుతుంది ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా యాంకర్ సుమ(Suma)తో కలిసి సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత ఈ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ తాను ముందుగా శాకుంతలం సినిమా అవకాశం రావడంతో ఈ సినిమాలో నటించడానికి నో చెప్పాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితే ఇలా ఈ సినిమాకి శాకుంతలం చెప్పడానికి గల కారణాన్ని కూడా సమంత తెలిపారు.తాను ఈ సినిమా కంటే ముందుగా ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఈ పాత్రలో సమంత నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి.
ఇలా రాజీ పాత్రలో నటించిన తాను ఒక్కసారిగా శాకుంతలం పాత్రలో నటించాలి అంటే తనకు భయం వేసిందని తెలిపారు.
శాకుంతలం పాత్ర అంటే ప్రతి సన్నివేశాల్లో అద్భుతమైన హావభావాలను పలికించాలి.ఇలా రాజీ పాత్రలో చూసిన నన్ను శకుంతల పాత్రలో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అన్న భయం తనలో కలిగిందని తెలిపారు.అయితే తనకు ఒక అలవాటు ఉంది తాను ఏదైనా భయం అనుకుంటే తప్పనిసరిగా ఆ పని చేసి తీరుతానని అందుకే ఈ సినిమాకి తిరిగి ఒప్పుకున్నానని ఈ సందర్భంగా సమంత శాకుంతలం సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సమంత కెరీర్లు ఈ సినిమా మొట్టమొదటి పౌరాణిక చిత్రం కావడం విశేషం.ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.