తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వారిలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma)ఒకరు.సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన, లేదా ఏ కార్యక్రమంలో మాట్లాడిన పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతూ ఉంటాయి.
తాజాగా గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో( Nagarjuna University) ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి.యూనివర్సిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్ 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్మ మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఇలా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత( Vangalapudi Anita ), వర్మపై యూజీసీకి, జాతీయ మహిళా కమిషన్ కిఫిర్యాదు చేసింది.ఈ క్రమంలోనే వర్మపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.ఇలా ఒకవైపు వర్మ గురించి తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉండగా మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman) సోషల్ మీడియా వేదికగా రాంగోపాల్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా వర్మ కు రెహమాన్ అభినందనలు తెలియజేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
అసలు రెహమాన్ వర్మ గారిని ఎందుకు అభినందించారు అనే విషయానికి వస్తే.
1985లో విజయవాడలోని వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు వర్మ.ఈ విధంగా ఈయన తన ఇంజనీరింగ్ పూర్తి చేసిన 37 సంవత్సరాల తర్వాత యూనివర్సిటీ నుంచి తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్ అందుకోవడం మనకు తెలిసిందే.ఇలా ఈయన తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ 37 సంవత్సరాల తర్వాత సర్టిఫికెట్ అందుకోవడం సంతోషంగా ఉంది.
థాంక్యూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్ షేర్ చేయడంతో ఎంతో మంది అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ క్రమంలోనే రెహమాన్ ( Rahman) సైతం కంగ్రాట్స్ రాము గారు అంటూ అభినందనలు తెలపగా వెంటనే వర్మ స్పందిస్తూ… సర్ థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.