కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది.ఈ మేరకు అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
సీబీఐ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.తదుపరి చర్యలపై స్టే ఇవ్వలేమని పేర్కొంది.
కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.అనంతరం సీబీఐ విచారణలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది.
అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయకుండా ఉండాలని, కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ అవినాశ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.