భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు నిరుద్యోగం: మాజీ ఆర్బిఐ గవర్నర్

ప్రస్తుతం పరిస్థితుల్లో భారత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమే నని ఆర్బిఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపారు.ఇటీవల ఈనాడు నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

 Former Rbi Governer-inflation-development-government , Former Rbi Governer , Sri-TeluguStop.com

కరోనా ముందు వరకు కూడా నిరుద్యోగం ఉందని అయితే కరోనా తర్వాత అది తీవ్ర స్థాయిలో పెరిగిందని అయితే బయటకు ఆ స్థాయిలో కనిపించకపోవడానికి కారణం నిరుద్యోగిత శాతం వ్యవసాయ రంగంలోనూ , అసంఘటితరంగాలను ఎక్కువగా ఉండటమేనని ఆయన తెలిపారు ….ఈ సవాలు ను ఎదుర్కోవడానికి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్లాలని అయితే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో అత్యధిక శాతం పాత అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడానికి సరిపోతుందని ఈ పరిస్థితులు మార్చుకుంటూ వెళ్లాలని సూచించారు.

Telugu Rbi, Lockdown, Pakistan, Sri Lanka-Latest News - Telugu

పెద్ద టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం పై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీలు భారీ స్థాయిలో విస్తరించాయని ఇప్పుడు కొంత మందగించడంతో తొలగింపులు చేస్తున్నాయని అయితే ఇది తాత్కాలిక పరిణామమేనని లాక్ డౌన్ వల్ల కొంత మంచికూడా జరిగిందని ఇంతకుముందు కొన్ని జాబ్స్ కి మాత్రమే ఉన్న వర్కు ఫ్రమ్ హోమ్ దాదాపు అన్ని రంగాల్లోనూ విస్తరించిందని తొందరలోనే టేక్ రంగం కూడా కోలుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు .

Telugu Rbi, Lockdown, Pakistan, Sri Lanka-Latest News - Telugu

విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నంతమాత్రాన మన పరిస్థితి పాకిస్తాన్ శ్రీలంక లా మారిపోదు ఎందుకంటే వాళ్ల ఆర్థిక నిర్వహణ వేరు మన ఆర్థిక నిర్వహణ వేరు .అమెరికా వడ్డీ రేట్లు పెంచితే ఆర్బిఐ డాలర్లు అమ్మి రూపాయి ని నిలబెట్టిందని అందువల్ల అమెరికా వడ్డ్డిరెట్లు పెంచితే కొంత విదేశీ మార్గం ఖర్చవుతుంది కానీ సంక్షోభం మాత్రం రాదని ఆయన భరోసా ఇచ్చారుజిఎస్టి ఆదాయం గణనీయంగా పెరిగిన ఉద్యోగాల కల్పన ఆ స్థాయిలో పెరగకపోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్నకు సమాదానంగా సాంప్రదాయతరఆర్థిక వ్యవస్థల్లో ఉన్న వస్తువులను కూడా జిఎస్టి పరిధిలోకి తీసుకురావడం వల్ల కొంత ఆదాయం పెరిగిందని అయితే ఉద్యోగుల పెరుగుదల ఉండదని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు అత్యధిక ఆదాయాన్ని పెట్టుబడి రంగంలోకి ఉపాధి కల్పనా రంగంలోకి పెట్టినప్పుడే నియంత్రణలోకి వచ్చి నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పడుతుందని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube