యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా తారక్ బిజీ అవుతున్నారు.2023లో ఎన్టీఆర్ జాతకం ఎలా ఉందనే ప్రశ్నకు సంబంధించి జ్యోతిష్కులు షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ది సింహ రాశి పుబ్బ నక్షత్రం అని ఆయన కామెంట్లు చేశారు.
పుబ్బ నక్షత్రం వాళ్లు ఏదైనా అనుకుంటే కుండ బద్దలుగొట్టినట్టు చేసుకుంటూ ముందుకు వెళతారని ఆయన కామెంట్లు చేశారు.ఈ నక్షత్రం వాళ్లు భయం లేకుండా బెరుకు లేకుండా అవతలి వాళ్లు ఏమనుకుంటారో అనే మొహమాటం లేకుండా ఉంటారని జూనియర్ ఎన్టీఆర్ మంచి ప్రవక్త అని జ్యోతిష్కుడు పేర్కొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ వాగ్ధాటి ఆయన జన్మ నక్షత్రం నుంచి వచ్చాయని జ్యోతిష్కుడు వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ గంభీరంగా ఉంటారని నలుగురిని కలుపుకునే మనస్తత్వమని ఆయన పేర్కొన్నారు.రాశి, నక్షత్రం వల్ల ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఉంటారని మాటిచ్చే తప్పని లక్షణం ఎన్టీఆర్ కు ఉందని జ్యోతిష్కుడు చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఎన్టీఆర్ జాతకంలో శుక్రుడు పీక్స్ లో ఉన్నాడని శుక్రుడు కలలకు అధిపతి అని ఆయన తెలిపారు.
తారక్ ప్రజా పాలనలో కూడా ఈ సంవత్సరం అడుగు పెడతాడని జ్యోతిష్కుడు పేర్కొన్నారు.
2023 సెప్టెంబర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు బాగుందని ఆయన తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ సమాజానికి సేవ చేయడానికి ప్రజల్లోకి రానున్నారని జ్యోతిష్కుడు వెల్లడించారు.2023 ఎన్టీఆర్ కు అనుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.కొన్ని ఇబ్బందులు ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ గ్రాఫ్ మాత్రం అద్భుతంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.ప్రభాస్ కు కూడా ఈ ఏడాది కలిసొస్తుందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.