గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.దీనిపై జనసేన నేత నాదెండ్ల మనోహార్ స్పందించారు.
వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు.
పైశాచిక ఆనందం కోసం ఇప్పటంలో మళ్లీ ఇళ్లను కూలుస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు.జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.14న మచిలీపట్నంలో జనసేన సభ సందర్భంగా అక్కడి రైతులను భయపెట్టడానికే ఇప్పటంలో కూల్చివేతలు కొనసాగిస్తున్నారన్నారు.సీఎం జగన్ కు పాలించే అర్హత లేదని విమర్శించారు.







