సార్ మూవీ చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించిన బాలయ్య బాబు.. ట్వీట్ వైరల్?

దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్,సంయుక్త మీనన్ కలిసిన నటించిన తాజా చిత్రం సార్.ఈ సినిమా గత నెల ఫిబ్రవరి 17వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

 Balakrishna Watches Dhanush Sir Movie Details, Balakrishna, Sir Movie, Dhanush,-TeluguStop.com

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఈ సినిమా తెలుగు తో పాటు తమిళంలో విడుదలైన విషయం తెలిసిందే.

రెండు బాషల్లో కూడా మంచి హిట్ టాక్ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాను విద్యావ్యవస్థ తీరు గురించి దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన ఆ విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.మరి ముఖ్యంగా ఈ సినిమాలోని మాస్టారు మాస్టారు అనే పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.

అలాగే ఈ సినిమాలో ధనుష్, సంయుక్త మీనన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఇది ఇలా ఉంటే ఈ సినిమా నందమూరి నటసింహం హీరో బాలకృష్ణకు తెగ నచ్చేసింది.

నిర్మాత నాగ వంశీ బాలయ్య కోసం సార్ ప్రత్యేకమైన షో ప్రదర్శించారు.

ఈ చిత్రం చూసిన అనంతరం బాలయ్య దర్శకుడిని, నిర్మాతని, నటీనటుల్ని అభినందించినట్లు తెలుస్తోంది.ఇదే విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.సార్ చిత్రం చూసి అభినందించిన బాలయ్య గారికి కృతజ్ఞతలు.

మీ రెస్పాన్స్ చూసి మేము థ్రిల్ అయ్యాం అని ట్వీట్ చేశారు నాగ వంశీ.హీరో ధనుష్ నటించిన ఈ సార్ సినిమా తెలుగులో ధనుష్ నేరుగా చేసిన మొదటి సినిమా కావడం విశేషం.

ఇప్పటికే తమిళంలో నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదల అయిన విషయం తెలిసిందే.తాజాగా డైరెక్ట్ గా తెలుగు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత అయ్యాడు ధనుష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube