ఖమ్మం జిల్లాలో అర్థరాత్రి సమయంలో ఉద్రిక్తత నెలకొంది.ఎన్టీఆర్ సర్కిల్ లో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బిల్డింగ్ పై నుంచి సాయి శరణ్య అనే విద్యార్థిని పడిపోయింది.
మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందకు పడినట్లు తెలుస్తోంది.దీంతో విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో కాలేజీ సిబ్బంది బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు శ్రీచైతన్య స్కూల్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.స్కూల్ యాజమాన్యం వేధింపుల వలనే సాయి శరణ్య ఆత్మహత్యాయత్నం చేసిందని ఆరోపించారు.
అనంతరం స్కూల్ ఉన్న ఫర్నీచర్, సామాగ్రిని విద్యార్థి సంఘాల నేతలు ధ్వంసం చేశారు.దీంతో పాఠశాల వద్ద టెన్షన్ వాతావరణం కనిపించింది.