టర్కీ భూకంప బాధిత పిల్లలకు ఈ ఫుట్‌బాల్‌ ప్రేమికులు ఏం చేశారో తెలిస్తే జేజేలు కొడతారు!

ఈ మధ్య తుర్కియే (టర్కీ), సిరియాలలో వచ్చిన భారీ భూకంపం కారణంగా వేలాది మంది మరణించిన విషయం అందరికీ తెలిసినదే.ఈ మహా ప్రళయం కారణంగా ఈ రెండు దేశాల్లో కలిపి సుమారు 50 వేల మందికిపైగా ప్రాణాలను కోల్పోగా, లక్షల కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది.

 Football Fans Throw Toys For Turkey Earthquake Affected Children Details, Turke-TeluguStop.com

అయితే ఈ భూకంప బాధితుల్లోని చిన్నారుల కోసం ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.టర్కిష్ సూపర్ లీగ్ లో భాగంగా బెసిక్తాస్, అంటాలియాస్పోర్ మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు.

వేల సంఖ్యలో బొమ్మలను గ్రౌండ్ లోకి విసిరారు.

కాగా స్టాండ్స్ లో నుంచి వాళ్లు అలా గ్రౌండ్ లోకి బొమ్మలు విసురుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఫ్యాన్స్ ఇలా చేయడానికి వీలుగా మ్యాచ్ ను 4 నిమిషాల 17 సెకన్ల దగ్గర కాసేపు నిలిపివేయడం గమనార్హం.మ్యాచ్ ను సరిగ్గా ఆ సమయానికి ఆపడం వెనుక కూడా ఓ కారణం ఉంది.

తుర్కియే, సిరియాల్లో తొలిసారి భూకంపం ఫిబ్రవరి 6న సరిగ్గా 4:17 గంటలకు వచ్చింది.దీంతో మ్యాచ్ ను కూడా 4 నిమిషాల 17 సెకన్ల దగ్గర ఆపడం జరిగింది.

అదే సమయంలో ప్రేక్షకులంతా బొమ్మలను గ్రౌండ్ లోకి విసిరారు.భూకంప బాధిత చిన్నారుల కోసం తమ అభిమానులు ఈ పని చేసినట్లు బెసిక్తాస్ క్లబ్ ఓ ప్రకటనలో తెలిపింది.

‘ఈ బొమ్మ నా ఫ్రెండ్’ అనే పేరుతో ఈ ఈవెంట్ నిర్వహించినట్లు తెలుస్తోంది.ఈ గొప్ప పని చూసి బెసిక్తాస్ టీమ్ డిఫెండర్ తయ్యిబ్ సనుక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.భూకంపం కారణంగా తుర్కియేకు తగిలిన గాయాలు మానడానికి వేలాది మంది ఫ్యాన్స్ ఇలా కలిసి రావడం చాలా అద్భుత విషయమని అన్నాడు.ఇకపోతే ప్రేక్షకులు విసిరిన వేలాది బొమ్మలతో గ్రౌండ్ బౌండరీలు మొత్తం నిండిపోయాయి.

వీటిని రెండు జట్లు ప్లేయర్స్ కలిసి ఒక్కచోటుకు చేర్చారు.ఈ మ్యాచ్ చివరికి గోల్ లేకుండా డ్రాగా ముగియడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube