స్వతంత్ర భారతదేశంలో ఎన్నో పండగలను ప్రజలు కన్నుల పండగగా జరుపుకుంటారు.అందులో హోలీ పండగ ఒకటి.
దీనిని దేశ ప్రజలు వేడుకగా జరుపుకుంటారు.అయితే ఈ పండగ కొన్ని ప్రాంతాలలో మాత్రం చాలా స్పెషల్ గా జరుపుకుంటారు.
ఆ ప్రదేశాలు ఏంటో ఓ లుక్కేద్దాం.అందులో మొదటగా “మధుర, ఉత్తరప్రదేశ్” గురించి చెప్పుకోవాలి.
శ్రీకృష్ణుని జన్మస్థలంగా ప్రసిద్ధి గాంచిన మధురలో హోలీ పండగని చాలా హాట్టహాసంగా జరుపుకుంటారు.ఈ క్రమంలో మథురలోని మనుషులతో పాటు దేవాలయాలు కూడా రంగులను పులుముకుంటాయి.

తరువాత రాజస్థాన్‌లోని “పుష్కర్” పట్టణంలో హోలీని చాలా ఘనంగా జరుపుకుంటారు.పట్టణంలోని ప్రధాన కూడలిలో మునుపటి రాత్రి చెక్క దుంగలతో వెలిగించిన సాంప్రదాయ భోగి మంటలు ప్రత్యక్షం అవుతాయి.మరుసటి రోజు ఉదయం హోలీ పార్టీలు ఉంటాయి.అదే విధంగా మీరు సరదాగా హోలీ పార్టీలను అనుభూతి చెందాలంటే హిమాచల్ ప్రదేశ్‌లోని “సిమ్లా”కి వెళ్లాల్సిందే.ఈ పట్టణం మొత్తం ఈ పండుగను ఒక కేంద్ర ప్రదేశంలో జరుపుకుంటారు.ఒకరిపై ఒకరు నీటి బెలూన్లు, రంగులు విసురుకుంటూ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఉంటారు.

తరువాత కర్ణాటకలోని “హంపి”లో హోలీ వేడుకలు హోలికా దహనంతో ప్రారంభమవుతాయి, ఇక్కడ ప్రజలు వసంతాన్ని స్వాగతించడానికి సాంప్రదాయ పాటలు పాడతారు.అలాగే ఉత్తరప్రదేశ్‌లోని “ఆగ్రా” వద్ద వందలాది మంది ప్రజలు హోలీ పార్టీలు జరుపుకుంటారు.అదే విధంగా పశ్చిమ బెంగాల్‌లోని “పురూలియా“లో హోలీని ప్రత్యేకంగా జరుపుకుంటారు.అసలు హోలీకి 3 రోజుల ముందే స్థానికులు సంబరాలను ప్రారంభిస్తారు.చివరగా హోలీ వేడుకలు పింక్ సిటీగా పేరు గాంచిన “జైపూర్”లో చాలా సుందరంగా నిర్వహిస్తారు.హోలీ వేడుకని ఇక్కడ జీవితంలో కనీసం ఒక్కసారైనా చూసి తరించాల్సిందే అని అనుభవజ్ఞులు చెబుతూ వుంటారు.