పొలిటికల్ రిటైర్మెంట్ పై కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్లీనరీలో సోనియా సంకేతాలు ఇచ్చారు.
భారత్ జోడో యాత్రతో తన ఇన్సింగ్స్ ముగిసిందని వ్యాఖ్యనించారు.
అనంతరం జోడో యాత్రపై ఆమె మాట్లాడుతూ ఇది పార్టీకి టర్నింగ్ పాయింటని తెలిపారు.ఖర్గే నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని సోనియా పిలుపునిచ్చారు.
దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర అన్నారు.సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని భారత్ జోడో యాత్ర రుజువు చేసిందని తెలిపారు.