కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం సార్.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే.
ఇందులో విద్యావ్యవస్థ గురించి అందులో ఉన్న అంశాల గురించి చక్కగా చూపించారు.ఈ సినిమాలో హీరో హీరోయిన్ ల నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
కాగా ధనుష్ ఈ సినిమాతో మొదటిసారిగా తెలుగులో స్ట్రైట్ గా సినిమా చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమాలోని కాన్సెప్ట్, హీరో ధనుష్ నటన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కార్పోరేట్ శక్తుల చేతుల్లో విద్య ఎలా బలవుతోంది అన్న విషయాన్ని నేరుగా చెప్పి, అటు యూత్‌ను ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను కట్టిపడేస్తున్నారు.ప్రస్తుతం చిత్రం బృందం సక్సెస్ మీట్ లో భాగంగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే చాలామంది ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దీంతో సార్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోందీ.
అయితే ఉగాది పండుగ కానుకగా సార్ సినిమా ఓటీటీలో తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంతే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే అంతవరకు వేచి చూడాల్సిందే మరి.ఈ వార్తలపై స్పందించిన కొంతమంది ప్రేక్షకులు ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది కాబట్టి ఇప్పట్లో ఈ సినిమా విడుదల కాదేమో అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.