నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి మనకు తెలిసింది.లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నటువంటి ఈయన ఉన్నఫలంగా గుండెపోటుకు గురి కావడంతో దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో విదేశీ నిపుణుల సమక్షంలో ఈయనకు చికిత్స జరిగినప్పటికీ ఈయన ఆరోగ్యంతో తిరిగిరాలేక మృతి ఒడిలో చేరారు.
తారక రత్న మరణించారనే వార్త ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాదం నింపింది.
తారకరత్న మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నందమూరి తారకరత్న మరణానికి సంతాపం ప్రకటించారు.ఇక బెంగళూరు నుంచి ఈయన పార్థివ దేహాన్ని మోకిలలోని తన సొంత ఇంటికి తీసుకువెళ్లారు.ప్రస్తుతం అభిమానుల సందర్శనార్థం తారకరత్న మృతి దేహాన్ని ఫిలిం ఛాంబర్ తరలించారు.
ఇక తారకరత్న మరణించారనే వార్త తెలియగానే పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు తరలివచ్చి ఆయనకు కన్నీటి నివాళులు అర్పించారు.
ఈ క్రమంలోనే సీనియర్ నటుడు మోహన్ బాబు మాత్రం తారకరత్న చివరి చూపు కోసం హాజరు కాలేదు అయితే ఈయన రాకపోవడానికి గల కారణాలను కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.నందమూరి తారకరత్న మరణం పై మోహన్ బాబు స్పందిస్తూ….ప్రస్తుతం తాను లండన్ లోను మా విష్ణు సింగపూర్ లోను ఉండటం వల్ల వ్యక్తిగతంగా తారకరత్న చివరి చూపుకు రాలేకపోయాము.
నా అన్న నందమూరి తారక రామారావు మనవడు తారకరత్న నా కుటుంబానికి నాకు ఎంతో ఆత్మీయుడు.తారకరత్న ఎంతో మంచివాడు, ఎంతో ఆత్మీయుడు ఎంతో స్నేహశీలో చెప్పటానికి నాకు మాటలు సరిపోవడం లేదు అంటూ ఈయన తారకరత్న మృతి పై స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.