హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీలోని నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.
అయితే దుండగులు దాడికి చేయడంపై ఎంపీ అసదుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన ఇంటి కిటికీలు పగిలిపోయాయని, ఇంటి చుట్టూ రాళ్లు పడి ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విధంగా దాడికి పాల్పడటం నాలుగోసారి అని ఆయన మండిపడ్డారు.రాళ్ల దాడికి పాల్పడిన నిందితులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ కోరారు.
మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆయన పోలీసులను కోరారు.ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం విచారణను వేగవంతం చేసింది.
సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా ఇప్పటికి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.