Seema Tamarinds : సీమ చింతకాయల వల్ల ఆరోగ్యానికి అన్ని ప్రయోజనాలు ఉన్నాయా..

సాధారణంగా చిన్నతనంలో ప్రతి ఒక్కరూ స్నేహితులందరితో కలిసి సీమ చింతకాయల కోసం పాఠశాలలకు వెళ్లకుండా ఉన్న రోజులు చాలానే ఉంటాయి.ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివన్నీ ఒక మధుర జ్ఞాపకాలు కానీ, ప్రస్తుత కాలంలో సీమ చింతకాయలంటే ఎక్కువ మందికి సరిగా తెలియదు.

 Are There All The Health Benefits Of Seama Tamarinds , Seema Chinthakayalu ,  Se-TeluguStop.com

పల్లెటూర్లలో నివసించే వారికి వీటి గురించి బాగా తెలుసు.వీటిని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ చింతకాయలు పచ్చిగా ఉన్నప్పుడు తింటే కాస్త వగరుగా ఉంటాయి.పక్వానికి వచ్చిన తర్వాత తింటే మాత్రం చాలా రుచిగా ఉంటాయి.

ఇవి దక్షిణ మెక్సికో, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా దేశాలకు చెందినవి.అయితే చాలా తక్కువ మందికి తెలిసిన ఈ సీమ చింతకాయలు ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడతాయో తెలిస్తే తినకుండా మాత్రం అస్సలు ఉండలేరు.

సీమ చింతకాయలు తినడం వల్ల మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి త్వరగా పెరుగుతుంది.గులాబీ, ఎరుపు, తెలుపు రంగులో ఉండే ఈ సీమ చింతకాయలు కాస్త వగరుగా, మరి కాస్త తీయ్యాగా ఉంటాయి.

వీటిలో కొన్ని విటమిన్లతో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి.

Telugu Tips, Immunity, Seama Tamarinds-Telugu Health Tips

ఇంకా చెప్పాలంటే వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ప్రోటీన్స్‌, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటి ఎన్నో పుస్తకాలు ఉంటాయి.ఇంకా చెప్పాలంటే వీటీని తినడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి లాంటి ఎన్నో సమస్యలు దూరమవుతాయి.జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను ఇవి పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు.

డయాబెటిస్ వ్యాధి ఉన్న వారు ప్రతిరోజు వీటిని తగిన మోతాదు లో తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుతాయి.వీటినీ తినడం వల్ల అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.

సీమ చింతకాయ కొమ్మను తీసుకొని మరిగించి ఆ నీటిని తీసుకోవడం వల్ల డయోరియా సమస్య తగ్గే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube