నిత్యం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు పోస్ట్ అవుతూ ఉంటాయి.అయితే అందులో కొన్ని మాత్రమే మనసుని హత్తుకుంటాయి.
అలాంటివి చాలా ప్రత్యేకంగా నిలిచిపోతాయి.ఈ క్రమంలోనే తాజాగా అన్యోన్యంగా ఉన్న ఓ వృద్ధ జంటకి సంబంధించిన క్యూట్ వీడియోను ఫొటోగ్రాఫర్ “సుతేజ్ సింగ్ పన్ను” సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ వీడియోలో పెద్దవయసున్న సిక్కు దంపతుల కెమిస్ట్రీ నెటిజన్లు ఆకట్టుకుంటోంది.ఇన్‌స్టాగ్రాం వేదికగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో మొదట టీ తాగుతున్న జంట వైపు పన్ను నడుచుకుంటూ రావడం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక అక్కడ వున్న దృశ్యాన్ని చూసిన మనోడు తన కెమెరాలో వారి ఫొటోలు తీసుకునేందుకు వృద్ధ జంట అనుమతిని కూడా కోరడం ఇక్కడ గమనించవచ్చు.వారు అంగీకరించడంతోనే ఫొటోలు తీసి వారికి చూపించడంతో వెనువెంటనే ఫొటోలు ప్రింట్ అవడంపై పెద్దాయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మరికొన్ని ఫొటోలు తీయాలని కోరగా మరలా మనోడు రెచ్చిపోతాడు.ఇకపోతే ఈ అందమైన వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ సుమారుగా 9 లక్షల మందికి పైగా చూడడం విశేషమనే చెప్పుకోవాలి.
ఇక ఆ వీడియో వృద్ధ దంపతుల మధ్య స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంగా కనబడుతోంది.బేసిగ్గా రాపర్ అయినటువంటి బాద్షా ఈ పోస్ట్‌పై స్పందిస్తూ… రీల్స్, సెల్పీలకే ప్రేమ పరిమితమైన రోజుల్లో ఈ జంట సింపుల్ లవ్ ఎలా ఉంటుందో వెల్లడించారని కామెంట్ చేయడం విశేషం.అంతేకాకుండా సదరు వీడియోని చూసిన నెటిజన్లు… వారు నిజాయితీగా మురిసిపోవడం చూస్తుంటే మన గ్రాండ్‌పేరెంట్స్ అప్పట్లో ఎలా జీవించారనేది స్పష్టంగా గొంచరిస్తోందని రాసుకొచ్చారు.
కొందరైతే తమ గ్రాండ్‌పేరెంట్స్ ని మిస్ అయ్యామని బాధను వ్యక్తం చేస్తున్నారు.