మారుతి సుజుకి దుమ్ము రేపుతోంది.2023 ప్రారంభంలోనే కార్ల విక్రయాలలో టాప్ గేర్‌లో దూసుకుపోతోంది.సాధారణంగానే ఆటోమొబైల్ రంగానికి ఈ ఏడాది ప్రారంభం చాలా బాగుంది.మొదటి నెలలో అనగా జనవరిలో, కార్ కంపెనీలకు మంచి అమ్మకాల గణాంకాలు ఉన్నాయి.జనవరి 2023లో 3,45,805 ప్యాసింజర్ కార్లు అమ్ముడయ్యాయి.ఇది గత ఏడాది జనవరి అమ్మకాలతో పోలిస్తే 17 శాతం వృద్ధి నమోదు అయింది.
జనవరి 2023లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ కార్ల గురించి పరిశీలిద్దాం.
మారుతి సుజుకి కంపెనీ 2023 జనవరిలో అత్యధిక కార్లు విక్రయించిన కంపెనీగా నిలిచింది.గత నెలలో 1,50,046 కార్లను విక్రయించి ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది.2022 జనవరిలో 1,28,350 కార్ల విక్రయాలను నమోదు చేసింది.అంటే గతేడాది జనవరితో పోలిస్తే 16.90 శాతం వృద్ధి కనిపించింది.ఆ తర్వాత స్థానంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఉంది.ఆ సంస్థ 2023 జనవరిలో 45,799 కార్లను విక్రయించింది.2022 జనవరిలో ఈ సంస్థ 37,946 కార్లను విక్రయించగా ఈ ఏడాది 20.69 శాతం వృద్ధి నమోదు చేసింది.ఇక మూడో స్థానంలో టాటా మోటార్స్ సంస్థ ఉంది.
2023 జనవరిలో ఈ సంస్థ 45,061 కార్లు విక్రయించింది.2022 జనవరిలో ఈ సంఖ్య 10,493గా ఉంది.అంటే గతేడాది జనవరితో పోలిస్తే గత నెలలో 30.35 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.ఇక నాలుగో స్థానంలో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కంపెనీ ఉంది.గత నెలలో 33,706 కార్లను ఆ కంపెనీ విక్రయించింది.2022 జనవరిలో 13,868 కార్లు విక్రయించగా గతేడాదితో పోలిస్తే భారీ స్థాయిలో 69.90 శాతం వృద్ధి రేటు సాధించింది.ఈ జాబితాలో 5వ స్థానంలో కియా మోటార్స్ సంస్థ ఉంది.2023 జనవరి నెలలో 19,297 కార్లను ఆ కంపెనీ విక్రయించింది.2022 జనవరిలో ఆ సంఖ్య 9,824గా ఉంది.గతేడాదితో పోలిస్తే ఏకంగా భారీ స్థాయిలో 96.42 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది.