విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు మూవీ వెండితెరపై, బుల్లితెరపై సంచలనం అనే సంగతి తెలిసిందే.2016 సంవత్సరం మే నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.విజయ్ ఆంటోని, సట్నా టైటస్ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని రేంజ్ లో లాభాలు వచ్చాయి.
అయితే బిచ్చగాడు మూవీకి సీక్వెల్ గా బిచ్చగాడు2 తెరకెక్కగా తాజాగా ఈ సినిమా నుంచి స్నీక్ పీక్ విడుదలైంది.అయితే బిచ్చగాడు2 ట్రైలర్ ను చూస్తే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.
బిచ్చగాడు పార్ట్1 బిచ్చగాడు పార్ట్2 కు ఏ మాత్రం పొంతన లేదు.కేవలం బిజినెస్ కోసమే ఆ టైటిల్ ను ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
బిచ్చగాడు2 మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది.బిచ్చగాడు2 మూవీ అంచనాలకు మించి విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బిచ్చగాడు2 సమ్మర్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.బిచ్చగాడు2 మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బిచ్చగాడు2 సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.బిచ్చగాడు2 సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం బిచ్చగాడు3 దిశగా అడుగులు పడతాయని తెలుస్తోంది.బిచ్చగాడు సినిమా తర్వాత విజయ్ ఆంటోని నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయనే సంగతి తెలిసిందే.జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకు విజయ్ ఆంటోని స్థాయి పెరుగుతుండగా విజయ్ ఆంటోని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.