కథలు ఎన్ని రాసిన మూలం ఒకటే… సినిమాలు ఎన్ని తీసిన అందులో ఉండే అర్థం ఒకటే అన్న విధంగా ఉంది ప్రస్తుత సినిమాల పరిస్థితి.ఓకే మూల కథతో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక సినిమాలు పుట్టుకొస్తున్నాయి కథ ఒకటే కానీ కథనం మారడంతో ప్రేక్షకుల దృష్టి మారుతుంది.
పిలుస్తున్న విధానం మారడం అలాగే పాత్రలు కూడా సరికొత్తగా మారిపోతుండడంతో చూస్తున్న ప్రేక్షకుడు గుర్తు కూడా పట్టడం లేదు.మరి ఒకే కథ వస్తువుతో ఇండస్ట్రీకి వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు ఎన్ని ? ఫ్లాప్ అయినా సినిమాలు ఎన్ని ? ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అన్న
రాజశేఖర్ హీరోగా వచ్చిన సినిమా పేరు అన్న.దీనికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో హీరోయిన్గా గౌతమి నటించింది కథ ప్రకారం హీరో రోజు గొడవలు పడుతూ ఉంటాడు.ఇంటికి రక్తపు మరకలతోనే వస్తాడు.అలా గొడవలకు దిగొద్దు అని చెప్పే పాత్రలో గౌతమి నటించింది.అలా కొట్లాటకు వెళ్ళే భర్తను బార్య చెప్పడమే ఈ సినిమా కథ.
మిర్చి
భార్య, కొడుకు వద్దనుకొని జనాల కోసం, ఊరి క్షేమం కోసం పాటు పడే కథతో మిర్చి సినిమా రాగ ఆ వూరి పెద్ద పాత్రలో సత్యరాజ్ నటించాడు.దీనికి రెండు ఊర్ల మధ్య పగలు, ప్రతీకారాలు అంటూ దర్శకుడు చూపించిన విధానం కాస్త భిన్నంగా ఉంటుంది కానీ కథ మాత్రం ఒకటే.
శంఖం
ఈ సినిమాలో సైతం మిర్చి సినిమాను పోలినట్టే పాత్రలు, కథ, కథనం ఉంటుంది. ఈ సినిమాలో కూడా తండ్రి పాత్ర లో సత్యరాజ్ నటించిన తీర్చిదిద్దిన విధానంలో తేడా ఉండడంతో ఎవరు గుర్తుపట్టలేదు.
ఈ మూడు సినిమాల్లో మిర్చి సినిమా మంచి హిట్ అయింది.మిర్చి సినిమాకు దర్శకుడుగా ఆ కొరటాల శివ పని చేశాడు ప్రభాస్ స్టైల్, అలాగే సినిమాలోని ప్రదర్శన ఎలిమెంట్స్ అన్ని చక్కగా కుదరడంతో ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది.
మరి ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్ అయితే ఒక రేంజ్ లో పాపులర్ అయ్యాయి.ఈ సినిమాతోనే ప్రభాస్ నటన స్థాయి కూడా బాగా పెరిగిపోయిందని చెప్పాలి.