పాకిస్తాన్ నేడు చాలా గడ్డుకాలాన్ని అనుభవిస్తోంది.అవును, పాకిస్తాన్ రోజురోజుకు ఆర్థిక సంక్షోభంలో కురుకుపోతోంది.
ప్రపంచ దేశాల అభిప్రాయంలో తీవ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశంగా పాకిస్తాన్ గుర్తించబడినప్పటికీ ఉగ్రవాదం మరియు పేదరికం కాకుండా, ఈ దేశంలో అనేక చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయి.కాగా ఇవి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కాయి కూడా.
ప్రపంచంలోనే 2వ అత్యంత ఎత్తైన పర్వతం K2 పాకిస్థాన్‌లో ఉందని మీలో ఎంతమందికి తెలుసు.అవును, ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం 8848 మీటర్లు కాగా, కె 2 ఎత్తు 8611 మీటర్లు కావడం విశేషం.
అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద, లోతైన ఓడరేవు పాకిస్తాన్‌లోని గ్వాదర్‌లో కొలువుదీరింది.దీనిని గ్వాదర్ పోర్ట్ అని కూడా అంటారు.అంతేకాకుండా పాకిస్తాన్‌లో ఉన్న కారకోరం హైవే ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచినది.
ఇక ఫుట్‌బాల్‌లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో పాకిస్తాన్ ఒకటని మీకు తెలిసుండదు.ప్రపంచంలోని సగం ఫుట్‌బాల్‌లు పాకిస్తాన్‌లో తయారవుతున్నాయి తెలుసా? ఇక్కడ ఫుట్‌బాల్ ఇప్పటికీ చేతితో తయారు చేయబడుతుంది.
ఇకపోతే పాకిస్తాన్ యొక్క ఈధి ఫౌండేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటీర్ అంబులెన్స్ సర్వీస్.ప్రపంచంలో నాలుగో అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థ పాకిస్తాన్‌లో కలదు.సింధు లోయ నీటిపారుదల వ్యవస్థ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థగా కొనసాగుతోంది.
పురాతన నాగరికతగా పరిగణించబడే సింధు నాగరికత, ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలో కూడా అక్కడక్కడా అభివృద్ధి చెందింది.సింధు నదిపై నిర్మించిన తర్బేలా ఆనకట్ట ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టని మీకు తెలుసా? ఇది పాకిస్తాన్‌లోని ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్ కిందకు వస్తుంది.అలాగే ప్రపంచంలో అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏకైక ఇస్లామిక్ దేశం పాకిస్తాన్ అని చెప్పుకోవాలి.