లేడీ అమితాబ్ విజయశాంతి ఒకప్పుడు ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ లో సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.తన సినీ కెరీర్ లో 180కు పైగా సినిమాలలో నటించనని ఆమె అన్నారు.
దాదాపుగా అన్ని భాషల సినిమాలలో నటించగా ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నేను నటించడం జరిగిందని విజయశాంతి కామెంట్లు చేశారు.నేను చిన్న వయస్సులో ఉన్న సమయంలోనే నాన్న గుండెపోటుతో మరణించడం జరిగిందని విజయశాంతి చెప్పుకొచ్చారు.
నాన్న చనిపోయారనే బాధతో అమ్మ మంచాన పడిందని ఆమె కామెంట్లు చేశారు.కొంతకాలం తర్వాత అమ్మ చనిపోయారని విజయశాంతి అన్నారు.

అయితే నేను మాత్రం ఎవరిపై ఆధారపడకుండా బ్రతికానని విజయశాంతి చెప్పుకొచ్చారు.ఫస్ట్ మూవీకి నా రెమ్యునరేషన్ 5,000 అని ఆ తర్వాత రోజుల్లో రజనీకాంత్, అమితాబ్ తర్వాత కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగానని ఆమె కామెంట్లు చేశారు.చాలాసార్లు ప్రమాదాలలో చిక్కుకుని చచ్చి బ్రతికానని విజయశాంతి చెప్పుకొచ్చారు.

లేడీ బాస్ మూవీ క్లైమాక్స్ లో చేయి స్లిప్ కావడంతో రాడ్ పట్టుకున్నానని రైలు కదులుతూనే ఉందని నేను గాల్లో ఎగురుతున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఒక తమిళ మూవీ షూట్ సమయంలో చీరకు, జుట్టుకు నిప్పంటుకుందని విజయశాంతి కామెంట్లు చేశారు.విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో కూడా కెరీర్ ను కొనసాగిస్తున్నా పాలిటిక్స్ లో ఆమెకు ఆశించిన ఫలితాలు దక్కే అవకాశాలు అయితే కనిపించడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
విజయశాంతి వరుస సినిమాలతో బిజీ అయితే బాగుంటుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.