రెండేళ్లు దాటితే ఏ స్మార్ట్ ఫోన్ అయినా ఏవో ఒక సమస్యలు వస్తుంటాయి.దీంతో పాటు మార్కెట్ లోకి కొత్త కొత్త ఫీచర్లతో ఫోన్లు వస్తుంటాయి.
దీంతో చాలా మంది కొత్త ఫోన్లు కొంటుంటారు.వాటిలో కొన్ని ఫోన్ల గురించి తెలుసుకుందాం.
ఇక భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎక్కువ మంది కొనే, ఇష్టపడే ఫోన్లలో ఐఫోన్ ఒకటి.iPhone 13 దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఫోన్లలో ప్రథమ స్థానంలో ఉంది.గతేడాది సెప్టెంబర్ నెలలో ఇది భారత మార్కెట్‌లోకి వచ్చింది.12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇందులో అమర్చారు.దీనిని ప్రారంభ ధర రూ.64,900లకు కొనుగోలు చేయొచ్చు.దీని తర్వాత స్థానంలో Samsung Galaxy M13 ఫోన్ ఉంది.6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే ఉంటుంది.అంతేకాకుండా ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు.దీనిని రూ.11 వేలకు కొనుగోలు చేయొచ్చు.
తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు అందించే Xiaomi కంపెనీ ఎన్నో ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది.అందులో Redmi A1 బాగా ప్రజాదరణ పొందింది.భారత దేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న ఫోన్ల జాబితాలో ఇది మూడో స్థానంలో ఉంది.దీని ధర కేవలం రూ.6 వేలు మాత్రమే.6.52 హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ కెమెరా ఇందులో ఉంటాయి.ఇక ప్రజాదరణ పొందిన ఫోన్ల జాబితాలో Samsung Galaxy A04s నాలుగో స్థానంలో ఉంది.దీని ధర రూ.13,499 నుంచి ప్రారంభం అవుతుంది.ఇందులో 50 ఎంపీ కెమెరా ఉంటుంది.అంతేకాకుండా 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు.ఈ జాబితాలో ఐదవ స్థానంలో Realme C35 ఫోన్ ఉంది.దీనిలో 6.6 అంగుళాల డిస్ ప్లే ఉంది.50 ఎంపీ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు.దీని ప్రారంభ ధర రూ.11,999గా విక్రయిస్తున్నారు.