టాలీవుడ్ లెజెండ్ అల్లు రామలింగయ్య యొక్క తనయుడు అల్లు అరవింద్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా వెలుగు వెలుగుతున్న విషయం తెలిసిందే.అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు.
వారిలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరో గా ఇప్పటికే గుర్తింపుకు దక్కించుకుని దూసుకు పోతున్నాడు.మరో వైపు అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ హీరో గా సక్సెస్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు.
ఈ సమయం లోనే అల్లు అరవింద్ యొక్క పెద్ద కొడుకు అల్లు బాబీ ఏం చేస్తాడు అంటూ అల్లు వారి ఫ్యామిలీ అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.అల్లు అరవింద్ పెద్దబ్బాయి అల్లు బాబీ విషయానికి వస్తే ఆయన మొదట సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు.
వ్యాపారాలు చేసుకుంటూ ఇండస్ట్రీ కి దూరంగా ఉండడంతో ఆయన ని ఇండస్ట్రీ లో చాలా మంది గుర్తు పట్టారు.
ఈ మధ్య కాలం లోనే నిర్మాతగా ‘గని‘ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూట కటుకుంది.అల్లు బాబీ మొదటి సినిమా తోనే నిర్మాతగా నిరాశ పడడంతో తదుపరి సినిమా విషయం లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తన తండ్రి నిర్వహిస్తున్న గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కాకుండా సొంత నిర్మాణ సంస్థ తో సినిమాలు చేయాలని భావించిన అల్లు బాబీ కి మొదటి లోనే షాక్ తగిలింది.ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తాడా లేదంటే ఒక సినిమా తోనే ఆగిపోతాడా అనేది చూడాలి.ఏ నిర్మాతకైనా, నటుడికైనా, హీరోకైనా, దర్శకుడు కైనా మొదటి సినిమా సక్సెస్ అయితే ఆ తర్వాత కెరియర్ బాగుంటుంది.కానీ ఇప్పుడు అల్లు బాబీ కెరీర్ నిర్మాతగా ఎలా ఉంటుందో చూడాలి.