మనలో అనేకమందికి ప్రతి రోజు బ్యాంకులకు వెళ్లే పని ఉంటుంది.అంతెందుకు పల్లెటూళ్లలో కూడా ఆడవాళ్లు, మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు బ్యాంకులకు వెళ్లే పని ఉంటుంది.
అలాగే బ్యాంకు లావాదేవీలు చేసే వారు ప్రతి రోజు చాలా మంది ఉంటారు.అందుకే ఈ రోజుల్లో బ్యాంక్ ఎప్పుడు తెరిచి ఉంటుంది, ఎప్పుడు మూసి ఉంటుంది అనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి.
లేదంటే తీరా బ్యాంకుకి వెళ్ళాక అది కాస్త మూసి ఉంటే శ్రమతో పాటు సమయం కూడా వృధా అవుతుంది.

అయితే ప్రతినెల బ్యాంకులకు సెలవులు ఉంటాయనే విషయం చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు.RBI ప్రతినెలా సెలవుల జాబితాను విడుదల చేస్తుంది.ఈ నేపథ్యంలో ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లి వివిధ లావాదేవీల పనులను చేసుకునేందుకు ముందుగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
ప్రతి నెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడం ప్రతి ఒక్కరి విధి.అయితే ఇప్పుడు ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు వచ్చాయో తెలుసుకుందాం.
అయితే మీరు ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.కింది పేర్కొన్న సెలవులన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించవని తెలుసుకోవాలి.
ఇవి ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను మీద ఆధారపడి ఉంటాయి.

ఫిబ్రవరి 5 – ఆదివారం
ఫిబ్రవరి 11 – రెండో శనివారం
ఫిబ్రవరి 12 – ఆదివారం
ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
ఫిబ్రవరి 19 – ఆదివారం మరియు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి
ఫిబ్రవరి 20 – రాష్ట్ర దినోత్సవం (అరుణాచల్ ప్రదేశ్, మిజోరం లో సెలవు)
ఫిబ్రవరి 21- లూసార్ (సిక్కింలో బంద్)
ఫిబ్రవరి 25 – నాలుగో శనివారం
ఫిబ్రవరి 26 – ఆదివారం