బీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత ఖమ్మంలో ఫస్ట్ టైం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది.సీఎం కేసీఆర్ ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
జాతీయస్థాయిలో రాజకీయాలు చేసే దీశగా టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీపై నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో ఖమ్మం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరై విజయన్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రావటం జరిగింది.ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
బీజేపీ పై విమర్శలు చేస్తూనే మరోపక్క హామీలు ఇచ్చారు.దీనిలో భాగంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు.ప్రగతిరంగంలో విద్యుత్ రంగం మొదటిదని, కరెంటు రంగాన్ని కచ్చితంగా పబ్లిక్ సెక్టార్ లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
అదే బీఆర్ఎస్ పాలసీ అని స్పష్టం చేశారు.
అదేవిధంగా దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా 25 లక్షల కుటుంబాలకు అమలు చేయాలి.లేకపోతే తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఖమ్మం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో సంచలన హామీలు ఇచ్చారు. దేశంలో మార్పు తీసుకురావడానికి…ఈ పార్టీ ఆవిష్కరించబడటం జరిగిందని పేర్కొన్నారు.
ప్రశ్నించడానికి మరియు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి బీఆర్ఎస్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.