ఇళ్ల వద్దే దహన సంస్కారాలు చేసుకునే సౌలభ్యం.. 2 గంటల్లో పూర్తి చేయొచ్చిలా..

సాధారణంగా స్మశానాలు ఇళ్లకు దూరంలో ఉంటాయి.కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్మశాన వాటికలు లేక ప్రజలు తమ బంధువుల మృతదేహాలను చాలా దూరం మోసుకెళ్లాల్సి వస్తుంది.

 Ease Of Doing Cremation At Home.. Can It Be Done In 2 Hours. Mobile Crematorium,-TeluguStop.com

ఇండియాలో ఇలాంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.వాటిలో కర్ణాటక రాష్ట్రం, కుందాపూర్‌ సిటీ, బైందూర్‌లోని జడ్కల్ గ్రామ పంచాయితీలోని ముదుర్ గ్రామం ఒకటి.

ఈ గ్రామంలో ఉన్న స్మశాన వాటిక భూమి వివాదంలో ఉంది.దాంతో వీరికి స్మశాన వాటిక కరువైంది.

అందువల్ల వారు తమ బంధువుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందాపూర్‌ స్మశాన వాటికి ప్రయాణాలు చేస్తున్నారు.ఇలా చేయడం వారికి చాలా భారంగా మారుతోంది.

అయితే ఈ సమస్యకు ఎట్టకేలకు వారు పరిష్కారం కనుగొన్నారు.అదే మొబైల్ స్మశాన వాటిక.

ముదురు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఈ మొబైల్ శ్మశాన వాటిక ఏర్పాటు చేసింది.గతంలో ఇక్కడ షెడ్యూల్డ్ కులాల కమ్యూనిటీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి చనిపోగా అతడిని చాలా దూరంలో ఉన్న స్మశానానికి తీసుకెళ్లలేక వారు తమ ఇంటి సమీపంలోనే అంత్యక్రియలు జరిపించారు.దీంతో చాలామంది ఆ కుటుంబం పై తీవ్ర విమర్శలు చేశారు.చివరికి ఈ సమస్యకు ఎట్లైనా సరే పరిష్కారం వెతకాలని ఆలోచించారు.

చివరికి కేరళలో మొబైల్ శ్మశాన వాటికల గురించి వ్యవసాయ సహకార సంఘం అధికారులు తెలుసుకున్నారు.ఆపై రూ.5.8 లక్షలు పెట్టి మొబైల్ శ్మశానవాటికను కేరళలోని స్టార్ చైర్ కంపెనీ నుంచి కొన్నారు.ఈ మొబైల్ క్రిమిటోరియంలో 10 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ మండించి 2 గంటల సమయంలో మృతదేహాన్ని దహనం చేయవచ్చు.ఈ మొబైల్ స్మశాన వాటికను ఎవరైనా సరే తమ వద్దకు తెప్పించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube