తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు .కొద్దిరోజులు క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా అసంతృప్తి గురైన సంగతి తెలిసిందే.
ఈ మేరకు వారంతా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి రేవంత్ రెడ్డి పైన ,తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మాణిక్యం ఠాకూర్ పైన తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, అధిష్టానం దూతగా రంగంలోకి దిగిన దిగ్విజయ సింగ్ మాణిక్యం ఠాకూర్ ను తప్పించి ఆ స్థానంలో మాణిక్ రావు థాక్రే ను నియమించారు.దీంతో కాంగ్రెస్ లో ఠాకూర్ పై సంతృప్తి గురయిన వారంతా ఇక రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తము అంటూ ప్రకటనలు చేశారు.
అయితే కాంగ్రెస్ సీనియర్ నేత భవనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం ఇంకా అసంతృప్తి కి గురైనట్టు కనిపిస్తోంది .మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసి అధిష్టానం ఆగ్రహానికి గురైన వెంకటరెడ్డి తాజాగా ఇన్చార్జి మాణిక్యరావు థాక్రే రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు రాకుండా ,
తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.ఈరోజు ఎయిర్ పోర్టులో రేవంత్ తో పాటు ఆయన అనుకూల వర్గం మాణిక్ రావు థాక్రే కు ఘనంగా స్వాగతం పలికింది.ఈ స్వాగత కార్యక్రమానికి రేవంత్ వర్గం మినహా మిగిలిన వారు హాజరు కాలేదు.
ఇక గాంధీభవన్ కు చేరుకున్న మాణిక్యరావు ఠాకూర్ ఏఐసిసి సెక్రటరీలతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా స్వయంగా థాక్రే ఫోన్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని సమావేశానికి రావలసిందిగా కోరినా వెంకటరెడ్డి తాను రాను అంటూ ఆయనకు సమాధానం ఇచ్చారట.గాంధీ భవన్ కు తాను రానని, అవసరం అయితే బయట కలుస్తాను అని తేల్చి చెప్పారట.ప్రస్తుతం వెంకటరెడ్డి వ్యవహారం పై రేవంత్ వర్గం గుర్రుగా ఉంది.
పంతాలు పట్టింపులకు వెళ్లి పార్టీని దెబ్బతీస్తున్నారు అని, పార్టీ అధికారం లోకి తెచ్చే విధంగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వెంకటరెడ్డి పై చేస్తున్నారు.