స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో చూసాం.
ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా నటించి పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ నటులు ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ, ఒలీవియా మోరిస్, సముద్రఖని, అలీసన్ డూడీ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాకు కె.వి విజయేంద్రప్రసాద్ మంచి కథను అందించి పంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇక ఎం ఎం కీరవాణి మాత్రం ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించగా.డివివి దానయ్య మాత్రం ఈ సినిమాకు చాలా డబ్బు ఖర్చుపెట్టి అద్భుతంగా చూపించాడు.ఈ సినిమాకు దాదాపు రూ.550 కోట్లు ఖర్చు పెట్టగా రూ.1200 కోట్లు వసూలు చేసుకుని భారీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా మెప్పించారు.
అలా ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం ఇతర భాషలలో డబ్బింగ్ ద్వారా విడుదలై భారీ వసూల్ తో సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసుకుంది.ఇక ఈ సినిమా ఇప్పటివరకు చాలా అవార్డులను సొంతం చేసుకుంది.ఇందులో వచ్చిన ప్రతి ఒక్క పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ముఖ్యంగా కీరవాణి అందించిన నాటు నాటు పాట మాత్రం ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.అలా ఈ సినిమా ఒక విషయంలో మంచి గుర్తింపు అందుకుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమా మరో పురస్కారం అందుకుంది.కీరవాణి అందించిన నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ బాగా కేరింతలతో మునిగిపోయారని చెప్పవచ్చు.తాజాగా కాలిఫోర్నియాలో ది బెవెర్లీ హిల్టన్ హాల్ వేదికగా ఈ అవార్డు అందగా.
ఈ వేడుకకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి ఫ్యామిలీ పాల్గొని బాగా సందడి చేశారు.ఇక ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
అంతేకాకుండా ఇటువంటి గుర్తింపు పొందిన ఆర్ఆర్ఆర్ టీంకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సెలబ్రెటీలు, పలువురు రాజకీయ నాయకులు కంగ్రాట్స్ చెబుతున్నారు.అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తాజాగా ఈ సినీ బృందానికి కంగ్రాట్స్ చెప్పారు.ఆయన తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పురస్కారానికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ ప్రతి యొక్క భారతీయ పౌరుడు గర్వించే విధంగా చేసినందుకు కంగ్రాట్స్ చెప్పారు.ఆయన షేర్ చేసుకున్న స్టోరీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఈయన స్టోరీ ని చూసి ఆర్ఆర్ఆర్ టీమ్ మరింత మురిసిపోతున్నారు.