నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రధానాలయ దుకాణాల తొలగింపులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గడువు ముగియడంతో దుకాణాలను అధికారులు తొలగిస్తున్నారు.
అయితే అధికారులు తమకు సమయం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని దుకాణాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం గంగాధర మండపం దగ్గర బైటాయించిన బాధితులు ధర్నాకు దిగారు.
తమను న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చోన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.