తెలంగాణ కాంగ్రెస్ లో వార్ రోజురోజుకు ముదురు పోతుంది.రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లంతా ఏకతాటిపైకి రావడం, ఇటీవల నియమించిన పార్టీ రాష్ట్ర కమిటీల్లో సీనియర్ నాయకుల కంటే జూనియర్ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం దక్కడంపై బహిరంగంగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని వెళ్ళగలుగుతున్నారు.
పార్టీ మారేందుకు కూడా చాలామంది నేతలు సిద్ధమవుతున్నారు.ఎప్పటి నుంచో పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉన్న, ఇప్పుడు కాంగ్రెస్ కొత్త కమిటీల ఏర్పాటుతో అవి మరింత బహిర్గతం అయ్యాయి.
ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులకు కమిటీల్లో స్థానం కల్పించారు అంటూ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని వెళ్ళగకుతున్నారు.
అంతేకాదు ఈ కమిటీల పైన ఏర్పడిన వివాదం తేలే వరకు రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేతలు నిర్ణయించారు.
సేవ్ కాంగ్రెస్ పేరుతో సీనియర్ నేతలు అంతా ప్రత్యేక భేటీలు నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఒక సమావేశాన్ని నిర్వహించగా, ఈనెల 20వ తేదీన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంట్లో మరోసారి సమావేశం కాబోతున్నారు.
వాస్తవంగా ఈరోజు గాంధీ భవన్ లో పిసిసి కార్యవర్గ సమావేశం జరగాల్సి ఉన్నా, ఏఐసిసి ఆదేశాల మేరకు జనవరి 26 నుంచి చేపట్టే హాథ్ మే హాథ్ జోడో యాత్ర పై చర్చించనున్నారు.దీనిని కూడా బాయ్ కాట్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు డిసైడ్ కావడంతో , ఇక్కడ వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.
ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

ఈ వివాదాలు మరింత ముదిరితే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని భావించిన ఆ పార్టీ అధిష్టానం, సీనియర్లను బుజ్జగించడమే మంచిదని, ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వివాదాలను పెంచుకోవడం ద్వారా మరింత గా కాంగ్రెస్ దెబ్బతింటుందనే నిర్ణయానికి వచ్చింది.అందుకే కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరిని ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టానం పెద్దలు వర్తమానం పంపినట్లు సమాచారం.