శ్రీకాంత్ కృష్ణ స్వామి అయ్యంగార్.నటుడిగా, దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పుడిప్పుడే ఒక స్టార్ డం దిశగా అడుగులు వేస్తున్నాడు.
మంచి పాత్ర దొరికితే ఆయనలో ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడు అని మనం గతంలో రాసుకున్నాం.ఇక శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా జీవితం లోకి వెళ్లడం లేదు కానీ అయన వ్యక్తి గత జీవితం మాత్రం కాస్త భిన్నమైనదే.
అందుకే ఈ రోజు శ్రీకాంత్ లోని రెండో యాంగిల్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.శ్రీకాంత్ కి పాతికేళ్ల క్రితం పెళ్లి కాగా, ఆ టైం లో అయన ఒక డాక్టర్, కానీ సినిమా పురుగు అయన బుర్ర లోకి చేరాక డాక్టర్ కొలువును పక్కన పెట్టి ఇండస్ట్రీ కి వచ్చాడు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈయన ఆర్జీవీ కి ఏమాత్రం తీసిపోడు.భార్య విషయంలో కొన్ని తప్పులు చేశానంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తానే చెప్పుకున్న శ్రీకాంత్ మరి కొన్ని సంచలన విషయాలను సైతం పంచుకున్నాడు.తనకు ఇద్దరు కూతుళ్లు అని, వారి పేర్లు అనుష్క, అనన్య అని తెలిపాడు.పెద్ద కూతురు వయసు 24 ఏళ్ళు అని, ఆమె ప్రస్తుతం మెడిసిన్ చేస్తుంది అని తెలిపారు.
ఇక చిన్న అమ్మాయి కి 21 ఏళ్ళని ఆమెను కలిసి కూడా 14 సంవత్సరాలు గడిచిపోయింది అంటూ చెప్పుకోచ్చాడు.తన భార్యకు ఒక మంచి భర్తను కాలేకోపోయానని, కానీ తాను చెడ్డవాడిని మాత్రం కాదు అంటూ ఎమోషనల్ అయ్యాడు శ్రీకాంత్ అయ్యంగార్.
ఇక కూతుళ్లను చాల చాల మిస్ అవుతున్నానని, అలాగని వాళ్ళని నాతో కలిసి ఉండమని, లేదంటే టైం ఇవ్వమని అడుక్కొను అంటూ చెప్పాడు.

తనకు అడుక్కోవాల్సిన అవసరం లేదని, కానీ రాత్రి అయితే మాత్రం బెడ్ రూమ్ చూస్తే ఎంతో ఒంటరిగా ఫీల్ అవుతూ బాధ పడతా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.తన కూతుళ్ళకు తాను మంచి తండ్రిని కాలేకపోయినా వారంటే తనకు చాల ఇష్టం అని చెప్పాడు.ఒక అవకాశం ఇస్తే చాల హ్యాపీ అని ఇవ్వకపోతే మాత్రం వచ్చి అడగను అని తేల్చి చెప్పాడు.
వాళ్లకు నేను అవసరం లేకపోవచ్చు అలా అని వారిని గుర్తు చేసుకొని అని దాని అర్ధం కాదని, తనకు తన కుటుంబం అంటే ఎంతో ఇష్టం అని వారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడితే వారి నిర్ణయాన్ని గౌరవిస్తానని కూడా తెలిపాడు.అయితే శ్రీకాంత్ చెప్పే కొన్ని మాటలు పూర్తిగా స్థాయి వర్మ మాటలను పోల్చి ఉండటం తో ఆయన్ను కొందరు విమర్శిస్తున్నారు.
ఇష్టం ఉంటె ఎలా అయినా కాలవచ్చు కదా అడ్వైస్ చేస్తున్నారు.