పవన్ వారాహి నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక పవన్ కళ్యాణ్ వచ్చే వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు.

 Do You Know The Cost Of Pawan Varahi Number Registration Pawan Kalyan , Varahi N-TeluguStop.com

ఇకపోతే పవన్ కళ్యాణ్ కోసం వారాహి అనే ఒక వాహనాన్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు.అయితే ఈ వెహికల్ వచ్చినప్పుడు నుంచి అధికార ప్రతిపక్ష నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తుంది.

ముఖ్యంగా ఈ వాహనం రంగు ఆర్మీ వాహనాలకు సంబంధించిన రంగులా ఉందని ఇలాంటిది వ్యక్తిగతంగా ఉపయోగించకూడదు అంటూ అధికార నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇకపోతే తాజాగా వారాహి వాహనానికి నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ పూర్తి అయిందనే విషయం మనకు తెలిసిందే.

పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ వారాహి TS 13 EX 8384 పేరుతో వారాహిని రిజిస్ట్రేషన్ జరిగింది. ఇకపోతే తాజాగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వారాహి వాహనం గురించి పలు విషయాలను వెల్లడించారు.

ఈ వాహనానికి ఆలీవ్ గ్రీన్ ఉపయోగించాలని వార్తలు వచ్చాయి.అయితే ఇది ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని తెలిపారు.ఇక ఈ వెహికల్ బాడీ బిల్డర్ ఇచ్చిన సర్టిఫికెట్ పరిశీలించిన అనంతరమే పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపారు.

ఇక ఈయన మాట్లాడుతూ వారాహి వారం రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారని తెలిపారు.TS 13 EX 8384 నెంబర్ తో రిజిస్ట్రేషన్ కోసం నిబంధనలకు అనుగుణంగా డబ్బును చెల్లించి ఈ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.ఇక ఈ నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం 5000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు.

సాధారణంగా స్పెషల్ నెంబర్స్ అనేవి ఈజీగా ఎవరికి అలర్ట్ కావు అలాంటివి కావాలి అంటే ప్రభుత్వానికి 5000 కట్టి మనకు కావాల్సిన నెంబర్స్ తీసుకోవచ్చు.వారాహికి కూడా 5000 కట్టి 8384అనే రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నారని ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube