దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి త్రిష గురించి అందరికీ సుపరిచితమే.ఈమె తెలుగు తమిళ భాషలలో సుమారు 70 కి పైగా సినిమాలలో నటించి నటిగా ఎంతో గుర్తింపు పొందారు.ఈ విధంగా త్రిష ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో ఓ వెలుగు వెలిగింది.2016వ సంవత్సరం తర్వాత ఈమెకు కాస్త అవకాశాలు తగ్గిపోవడంతో త్రిష సినీ కెరియర్ ఇంతటితో ముగిసిందని అందరూ భావించారు.ఇలా ఈమెకు అవకాశాలు తగ్గినప్పటికీ అడపాద సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.
ఇకపోతే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో అభిమానులు ఈమె సినీ కెరియర్ గురించి గుర్తు చేసుకుంటున్నారు.అలాగే ఈమే త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ ఈమె నటించిన సినిమాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.20 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా త్రిషకు ఎంతోమంది అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈమె కెరియర్ ముగిసిందనే సమయంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక అభిమానులు ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ త్రిషను ఇండస్ట్రీలో తిరిగి నిలబెట్టిన సినిమా ఇదే అంటూ పోస్టులు పెడుతూ నటి త్రిషకు ట్యాగ్ చేస్తున్నారు.ఇక 20 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా త్రిష సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… దక్షిణాది హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయినందుకు సంతోషంగా ఉంది అంటూ తన జర్నీ గురించి చెప్పుకొచ్చారు.ఇక ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే సతురంగ వేట్టై పార్ట్ 2′, ‘రామ్ పార్ట్ 1’, పొన్నియిన్ సెల్వన్ 2, ది రోడ్ వంటి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.