రూపాయికే సినిమా..అది కూడా హైదరాబాద్ లో ..!

థియేటర్ లో సినిమా చూడాలంటే కచ్చితంగా రూ.500 నోటు ఉండాల్సిందే.ఒక వేళ తక్కువలో తక్కువ అనుకున్నా రూ.200 ఉండాలి.అదే ఫ్యామిలీతో సినిమా చూడ్డానికి మల్టీప్లెక్స్ కు వెళ్తే కనీసం రెండు వేలు అయినా ఉండాలి.అయితే హైదరాబాద్ లో మాత్రం ఓ థియేటర్లో కేవలం రూపాయికే సినిమా టికెట్ ను ఇస్తుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 A Movie For Rs..that Too In Hyderabad, One Rupee , Cinima, Hyderabad, Latest Ne-TeluguStop.com

ఇప్పుడు ఆ థియేటర్ ఎక్కడుంది? ఆఫర్ ఎన్నిరోజుల వరకూ ఉంటుందని అందరూ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ రూపాయికే టికెట్ ఆఫర్ చేస్తోంది.

మౌలాలిలో మూవీ మ్యాక్స్ ఏఎంఆర్ పేరుతో ఓ కొత్త మల్టీప్లెక్స్ థియేటర్ రూపుదిద్దుకుంది.డిసెంబరు 15వ తేదిన గ్రాండ్‌గా ఈ థియేటర్ ప్రారంభం కానుంది.

అయితే థియేటర్ ఓపెనింగ్ సందర్భంగా ఆ రోజు ఒక్క రూపాయికే టికెట్స్ ఇవ్వడం జరుగుతోంది.డిసెంబర్ 15వ తేదిన ఈ మూవీ మ్యాక్స్ థియేటర్లో 11 సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి.

తెలుగుతో పాటుగా హిందీ సినిమాలు కూడా ఇందులో ఆడనున్నాయి.

Telugu Cinima, Hyderabad, Latest, Rupee, Ups-Latest News - Telugu

మూవీమ్యాక్స్ ప్రారంభ ఆఫర్ కింద డిసెంబర్ 15వ తేదిన ఏ సినిమా చూసినా కూడా ఒక్క రూపాయికే టికెట్ ఇస్తున్నారు.ఆన్ లైన్ లో కూడా వీటికి సంబంధించిన టికెట్లు అనేవి అందుబాటులో ఉండటం విశేషం.అమెజాన్, బుక్ మై షోల్లో ఈ టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మూవీ మ్యాక్స్ మల్టీప్లెక్స్‌లో ఇప్పుడు యశోదా, మసూద, లవ్ టుడే, గుర్తుందా శీతాకాలం, చెప్పాలని ఉంది, హిట్-2, పంచతంత్రం, ఊంచాయి, కాంతార, దృశ్యం2, భేడియా సినిమాలు ప్రదర్శిస్తుండగా ఈ సినిమాలన్నింటికీ కూడా మూవీ మ్యాక్స్ లో రూపాయికే టికెట్ దొరుకుతోంది.ఇప్పటికే అన్ని టికెట్లు బుక్ అయిపోయాయి.

దీంతో డిసెంబర్ 15వ తేదిన ఈ మల్టిప్లెక్స్ దరిదాపుల్లో భారీగా ట్రాఫిక్ ఉండటం ఖాయం అనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube