ట్రూ కాలర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కాలర్ గుర్తింపు మరియు స్పామ్ బ్లాకింగ్ యాప్.స్పామ్ కాల్‌లు, ఆన్‌లైన్ స్కామ్‌ల నుండి తమను తాము రక్షించుకోవడానికి మిలియన్ల మంది వ్యక్తులు ప్రతిరోజూ తమ ఫోన్‌లలో దీనిని ఉపయోగిస్తున్నారు.
స్పామ్‌ను గుర్తించడం మరియు నిరోధించడంలో ఇది అనూహ్యంగా బాగానే ఉంది అనే వాస్తవం పక్కన పెడితే, మోసగాళ్లు, టెలిమార్కెటర్లు నుండి స్పామ్ కాల్‌లు, సందేశాలను నిరోధించడంలో దాని ప్రభావాన్ని పెంచడానికి ఇది సంవత్సరాలుగా నిరంతరం అప్‌డేట్ అవుతోంది.తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఇటీవల కాలంలో చాలా మంది కేటుగాళ్లు తాము ప్రభుత్వ అధికారులం అని పేర్కొంటున్నారు.అమాయకులకు ఫోన్ చేసి వాళ్లను బురిడీ కొట్టిస్తున్నారు.దానిని అడ్డుకునేందుకు ట్రూ కాలర్ కొత్త ఫార్ములా అమలు చేస్తోంది.ఇప్పుడు AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత అసిస్టెంట్ రూపంలో దాని యాప్‌కి మరో ప్రధాన అప్‌డేట్‌ను పరిచయం చేసింది.
దీనిని ట్రూకాలర్ అసిస్టెంట్ అని పిలుస్తారు.దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, మీకు ఏ కాల్‌లు ముఖ్యమైనవో మరియు ఏవి స్పామ్‌గా ఉన్నాయో గుర్తించడంలో మీకు సహాయపడటం.
ఇక మీకు వచ్చిన కాల్ నిజంగా ప్రభుత్వ అధికారిదో కాదో సింపుల్‌గా తెలుసుకోవచ్చు.బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లూ టిక్ కనిపిస్తుంది.
ఆ బ్లూటిక్ ఉంటే ఆ ఫోన్ నంబరు వెరిఫైడ్ అని అర్ధం.అలా కాకుంటే ఆ ఫోన్ నంబరు నకిలీది అని అర్ధం చేసుకోవచ్చు.
ప్రభుత్వ అధికారులు, ముఖ్యమైన వ్యక్తుల ఫోన్ నంబర్లు అధికారికమైతే వాటిని ట్రూ కాలర్ లిస్ట్ అవుట్ చేస్తుంది.కాబట్టి మీరు కొత్త ఫీచర్‌తో మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.