ఇటీవల రోజుల్లో చాలా మంది లివర్ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు.మద్యపానం అలవాటు ఇందుకు ప్రధాన కారణం.
ఒక్కొక్కరు ఒక్కో కారణం చేత మద్యాన్ని సేవిస్తుంటారు.మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా తాగడం మాత్రం మానరు.
ఇక కొందరైతే రెగ్యులర్ గా మద్యాన్ని సేవిస్తుంటారు.అసలు బాడీలో చుక్క పడనిదే కొందరు నిద్ర కూడా పోరు.
అయితే మద్యపానం వల్ల మొదట ఎఫెక్ట్ అయ్యేది లివరే.లివర్ సంబంధిత సమస్యల బారిన పడ్డవారు శారీరకంగా మరియు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను పడాల్సి వస్తుంది.
అందుకే లివర్ ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త ఎంతో అవసరం.అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే మీ లివర్ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక యాపిల్ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక దానిమ్మ పండును తీసుకుని తొక్క తొలగించి లోపల ఉండే గింజలను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, రెండు పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బలు, వన్ టేబుల్ స్పూన్ తేనె, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మన జ్యూస్ సిద్ధం అవుతుంది.ఈ యాపిల్ దానిమ్మ జ్యూస్ ను రోజుకు ఒకసారి సేవించాలి.ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల లివర్ లో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.లివర్ శుభ్రంగా మరియు ఆరోగ్యంగా మారుతుంది.లివర్లో పేరుకుపోయిన కొవ్వు సైతం కరుగుతుంది.అయితే ఈ జ్యూస్ ను తీసుకుంటూ రోజు మద్యాన్ని తాగేస్తే ఎటువంటి సమస్య ఉండదని చాలామంది భావిస్తారు.
కానీ అది పొరపాటు.మద్యం తాగే అలవాటును మెల్ల మెల్లగా తగ్గించుకుంటూ ఈ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
అదే మీకు, మీ లివర్ ఆరోగ్యానికి మంచిది.