US Army Zero Pressure Tyres : భారతీయ కంపెనీకి అరుదైన అవకాశం.. ఏకంగా అమెరికా సైన్యం కోసం పనిచేసే ఛాన్స్..!!

అమెరికాలో భారతీయులు సారథులుగా వున్న కంపెనీలు, సంస్థలు మంచి స్థాయిలో వున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మరిన్ని సంస్థలు కూడా భారతీయులకే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాయి.

 Indian-american Company Gets Usd 5 Million To Develop ‘zero-pressure’ Tyres-TeluguStop.com

ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, పెప్సీకో, మాస్టర్ కార్డ్, అడోబ్ వంటి దిగ్గజ సంస్థలు భారతీయుల సారథ్యంలోనే పనిచేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇండో అమెరికన్ నేతృత్వంలో పనిచేస్తున్న సంస్థకు యూఎస్ ఆర్మీకి సేవలందించే ఛాన్స్ దక్కింది.

అమెరికా సైన్యం కోసం పాత్ బ్రేకింగ్ జీరో ప్రెజర్ టైర్లను అభివృద్ధి చేసేందుకు గాను 5 మిలియన్ డాలర్ల నిధులను అందుకుంది.
వివరాల్లోకి వెళితే.

కేరళకు చెందిన అబ్రహం పన్నికొట్టు నేతృత్వంలోని ఒహియోకు చెందిన అమెరికన్ ఇంజనీరింగ్ గ్రూప్ (ఏఈజీ) ఒక వినూత్న కార్బన్ ఫైబర్ ప్రెజర్ జీరో టైర్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.పెంటగాన్ ఇప్పుడు దానిని తన సాయుధ దళాల కోసం తయారు చేయాలనుకుంటున్నట్లు కంపెనీ శుక్రవారం తెలిపింది.

దీనిలో భాగంగా తొలి ప్రెజర్ జీరో టైర్ 2023లో డెలివరీ చేస్తామని ఏఈజీ వ్యవస్థాపకుడు, సీఈవో పన్నికొట్టు వెల్లడించారు.రోడ్డు పక్కన బాంబులు లేదా తుపాకీ కాల్పుల వల్ల చిరిగిపోయినప్పటికీ నడిచే కార్బన్ ఫైబర్ టైర్లను తయారు చేయడానికి రక్షణ శాఖ ప్రాజెక్ట్ ఇచ్చినట్లు ఏఈజీ వెల్లడించింది.

Telugu American, Zero Pressure-Telugu NRI

సైనిక వాహనాల టైర్లు ప్రస్తుతం రన్ ఫ్లాట్ ఇన్సర్ట్‌లతో అమర్చబడినప్పటికీ, భారీ లోడ్‌లను మోయగల జీరో ప్రెజర్ టైర్‌లకు వాటిని అప్‌గ్రేడ్ చేయాలని అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది.వీటి వల్ల సైనికులను ప్రమాదకర పరిస్ధితుల మధ్య తరలించడానికి కూడా వీలు కలుగుతుంది.ఏఈజీ అభివృద్ధి చేసిన జీరో ప్రెజర్ టైర్ వీల్ పంక్చర్ అయినప్పటికీ 50 కి.మీ వేగంతో 300 మైళ్లు ఏకధాటిగా ప్రయాణించగలదు.ఏఈజీ చెబుతున్న దానిని బట్టి జీరో టైర్ చాలా కాలం వుంటుంది.ఏఈజీ జీరో ప్రెజర్ టెక్నాలజీకి పేటెంట్ , ట్రేడ్ మార్క్ కూడా వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube