RTC Driver Sandeep : దారుణం: బైకర్‌ను చితకబాదిన RTC డ్రైవర్‌.. కారణం ఇదే!

ప్రతి ఏటా కొన్ని వేల రోడ్డు ప్రమాదాలలో వందలాది మంది చనిపోతూ వుంటారు.ఇక్కడ ఎక్కువగా ఎదుటివాళ్ళ తప్పు కారణంగా పాపం అమాయకులు బలవుతూ వుంటారు.

 Atrocious The Rtc Driver Who Crushed The Biker This Is The Reason-TeluguStop.com

తాజాగా ఓ బైకర్‌ కారణంగా పెను ప్రమాదం జరగాల్సి వుంది.అయితే బస్సు డ్రైవర్‌ చాలా చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మాత్రం ఆ బైకర్‌ ని ఉపేక్షించలేదు.దాంతో RTC బస్సు డ్రైవర్‌, బైకర్ మధ్య పెద్ద వివాదమే చెలరేగి తన్నుకునే వరకు వెళ్లింది.

ఈ షాకింగ్‌ ఘటన కర్నాటకలో​ చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే, యెలహంకా ప్రాంతంలో తన భార్యతో కలిసి సందీప్ అనే వ్యక్తి బైకుపై రోడ్డుపై దూసుకు వెళ్తున్నాడు.

సరిగ్గా అదే రోడ్డుమీద ఆ సమయంలో బస్సు వెళ్తోంది.ఈ క్రమంలో సందీప్ బైక్ దానికి అడ్డుగా వచ్చింది.దీంతో, డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేశాడు.ఈ క్రమంలో ప్రమాదం తప్పింది.

అయితే, వెంటనే స్పందించిన సందీప్‌.బస్సు డ్రైవర్‌ వైపు కోపంగా చూసి బస్సులోకి ఎక్కి వార్నింగ్‌ ఇవ్వబోయాడు.

దీంతో వారిద్దరి మధ్య వాదనలు పెరిగి.ఆఖరికి తన్నుకునే దగ్గరకు వెళ్లింది.

దాంతో బస్సులో సందీప్‌ను పట్టుకుని డ్రైవర్ చితకబాదడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.కాగా, డ్రైవర్‌ దాడిలో సందీప్‌ తీవ్రంగా గాయపడగా స్థానిక ఆసుపత్రికి తరలించారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన నేపథ్యంలో బస్సు డ్రైవర్ ను పనిలోంచి తొలగించారు.అతడు ప్రభుత్వ బస్సు నడుపుతున్నప్పటికీ, అతడిని ప్రైవేటు సంస్థ నుంచి తాత్కాలికంగా తీసుకున్నామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube