తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు దిల్ రాజు.
అయితే నిర్మాత దిల్ రాజు సినిమాల పరంగానే కాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీల విషయంలో కూడా ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాడు.అంతేకాకుండా తరచూగా సోషల్ మీడియాలో దిల్ రాజు పేరు వినిపిస్తూనే ఉంటుంది.
ఏదో ఒక హాట్ టాపిక్ తో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటాడు దిల్ రాజు.ఇక ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా ఆయన చుట్టూ వివాదాలే నడుస్తున్నాయి.
కాగా మన ఇంటికి మొన్న హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా రిలీజ్ విషయంలో దిల్ రాజు అడ్డుపడ్డారు అంటూ ప్రచారాలు కొనసాగిన విషయం తెలిసిందే.
దాంతో కొద్దిరోజుల పాటు దిల్ రాజు పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.
ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగిన విషయం తెలిసిందే.అయితే ఆ వివాదం అయిపోయింది అనుకునే లోపే వారసుడు సినిమా వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది.
వారసుడు సినిమా రిలీజ్ కావడానికి నిర్మాత దిల్ రాజు థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆ విషయానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ కూడా ఇస్తానని నిర్మాత దిల్ రాజు తెలిపారు.
ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.
తన దగ్గర కేవలం 37 థియేటర్లో మాత్రమే ఉన్నాయని వాటిని ఉంచుకొని ఏకచిత్రాధిపత్యం సాగిస్తున్నాను అని అనడం కరెక్ట్ కాదు అని దిల్ రాజు తెలిపారు.
ఇక్కడ ఎవరూ ఎవరి మాట వినరని, సినీ పరిశ్రమ అంటే ఒక కుటుంబం అనే మాటలు పేరుకే గాని ఇక్కడ అందరూ కలిసి నడవడం అన్నది ఉండదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు దిల్ రాజు.సినిమాల్లోకి రావడం వల్ల నేను పాపులర్ ఉండవచ్చు కానీ నా స్నేహితులు నాతోపాటు కెరియర్ ను మొదలుపెట్టి కొన్ని వందల కోట్లు రియల్ ఎస్టేట్ లలో సంపాదించారు వారితో పోల్చుకుంటే నేను ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత దిల్ రాజు.
ఈ క్రమంలోని నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సినిమా అంటే సిగ్గు,నీతి, మానం లేనిదే అంటూ కామెంట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అయితే నిర్మాత దిల్ రాజు సినీ ఇండస్ట్రీ ని నమ్ముకుని 20 ఏళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.అటువంటి దిల్ రాజు ఈ విధంగా సినీ పరిశ్రమ గురించి కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.ఈ వార్తపై పలువులు స్పందిస్తూ నిర్మాత దిల్ రాజు వయసు పెరిగే కొద్దీ కాంట్రవర్సీలు పెరుగుతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.