Junior NTR Licious Ad : యాడ్ లో కూడా తన మార్క్ డైలాగ్స్ వాడిన ఎన్టీఆర్.. ఇక హిట్టే!

టెంపర్ సినిమా నుండి వరుస హిట్స్ కొడుతూ మొన్న రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు తారక్.అప్పటి నుండి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడకుండా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ పెంచుకుంటూ వస్తున్నాడు.

 Junior Ntr Brand Ambassador For Licious Ad Viral, Ntr , Koratala Siva , Ntr30 ,-TeluguStop.com

కొమరం భీం గా మరింత అభిమానం సంపాదించుకున్న ఎన్టీఆర్ కు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు తమ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించు కోవడానికి ఆసక్తిగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈయన తాజాగా లిషియస్ అనే ఫుడ్ బ్రాండింగ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఓకే చెప్పాడు.

దీనికి సంబందించిన యాడ్ షూట్ లేటెస్ట్ గా రివీల్ చేసారు.నిన్నటి నుండే ఈ యాడ్ షూట్ మీద ఉత్సాహం పెంచుకునేలా చేసి ఈ రోజు ఈ యాడ్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడంతో వెంటనే వైరల్ అయ్యింది.

టెంపర్ క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్ తరహాలోనే ఎన్టీఆర్ బోనులో నిల్చుని చెప్పిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.ఈయన యాడ్ లో కూడా తన మార్క్ చూపించారు.

ఈ యాడ్ సూపర్ హిట్ అయినట్టే అని ఫ్యాన్స్ అప్పుడే మెసేజ్ చేస్తూ ఈ వీడియోను వైరల్ చేసేస్తున్నారు.ఇక ఈ యాడ్ లో ఎన్టీఆర్ తో పాటు రాహుల్ రామకృష్ణ కూడా కనిపించాడు.

ఇదిలా ఉండగా ఈయన ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.చూడాలి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో.ఎప్పుడు రిలీజ్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube