సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నయనతార జ్యోతిక ప్రభు వంటి వారు కీలక పాత్రలో నటించిన చిత్రం చంద్రముఖి. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి పి వాసు దర్శకత్వం వహించారు.
అప్పట్లో ఈ సినిమా ఎన్నో అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతో భయభ్రాంతులకు గురిచేసింది.ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో లారెన్స్ కథానాయకుడుగా నటించబోతున్నారు.
పి వాసు దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇదివరకే ఈ సినిమా కొన్ని షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్ లో నిర్వహించారు.ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతుంది.
ఇలా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో కీలకపాత్రలో నటించడం కోసం బాలీవుడ్ బ్యూటీ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రంగంలోకి దిగబోతున్నారని సమాచారం.
చంద్రముఖి 2 సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం చిత్ర బృందం కంగనా రౌనత్ ను సంప్రదించారని తెలుస్తోంది.
ఇలా ఈమె ఈ సినిమాలో నటించబోతున్నారని తెలియడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.త్వరలోనే ఈ సినిమా గురించి అధికారకంగా ప్రకటన రాబోతోంది.హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి కంగనా కేవలం సినిమాల విషయంలో మాత్రమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కూడా వార్తలలో నిలుస్తుంటారు.
మరి చంద్రముఖి 2 సినిమా ద్వారా ఈమె ప్రేక్షకులను ఎలాంటి భయభ్రాంతులకు గురిచేస్తుందో తెలియాల్సి ఉంది.