టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖరుడు కృష్ణ మరణించి పది రోజులు కావస్తోంది.ఈ క్రమంలోనే ఈయన మరణ వార్త గురించి ఇంకా చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది.
ఇక కృష్ణ మరణించడంతో ఆయన కుమారుడు మహేష్ బాబు తన తండ్రికి చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు.ఈ క్రమంలోనే కృష్ణ అస్థితులను విజయవాడలోని కృష్ణానదిలో నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే.
ఇలా సోమవారం ఉండవల్లి వద్ద కరకట్ట సమీపంలో మహేష్ బాబు సాంప్రదాయ బద్దంగా తన తండ్రి అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబుతో పాటు పలువురు సినీ దర్శకులు అలాగే తన బావలు ముగ్గురు, ఇక మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విజయనిర్మల కుమారుడు నరేష్ లేకపోవడం గమనార్హం.కృష్ణ మరణించిన సమయంలో ఆయన అంత్యక్రియల వరకు పెద్ద ఎత్తున హంగామా చేసిన నరేష్ ఇలా కృష్ణ అస్థితులను కృష్ణా నదిలో నిమర్జనం చేయడానికి రాకపోవడంతో పలువురు ఈ విషయంపై సందేహాలను వ్యక్తపరిచారు.
ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు స్పందించి క్లారిటీ ఇచ్చారు.కృష్ణ అంత్యక్రియల సమయంలో నరేష్ నటి పవిత్ర లోకేష్ తో పెద్ద ఎత్తున రచ్చ చేశారు.
నరేష్ పవిత్ర ఇద్దరూ కలిసి రావడమే కాకుండా సొంత మనిషి లాగా పవిత్ర అన్ని కార్యక్రమాలను చేయడానికి ముందుకు రావడం మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ఏమాత్రం నచ్చలేదు.ఇక అంత్యక్రియల సమయంలో నరేష్ పలు కార్యక్రమాలను చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ మహేష్ బాబు కుటుంబ సభ్యులు తనని చేయనివ్వకపోవడంతో అలిగి వెళ్లిపోయారని రామారావు వెల్లడించారు.అందుకే కృష్ణ గారి అస్థికలను కృష్ణా నదిలో కలిపే సమయంలో కూడా ఈయన హాజరు కాలేదని తెలిపారు.ఇక కృష్ణ రక్తం పంచుకు పుట్టిన కుమారుడు మహేష్ కావడంతో ఆయన ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తించినట్టు తెలిపారు.