ప్రతి శుక్రవారం సినిమా వారికి ఒక పండగ.శుక్రవారం వచ్చింది అంటే ఏ సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి, ఏ చిత్రాలను ఓటిటి( ott ) ఆదరిస్తుంది అనే విషయాలపై ఎద్ద చర్చ జరుగుతూ ఉంటుంది.
శుక్రవారం హీరో ఎవరా అని ఎదురు చూడడం ఆ వారం ఎవరు విజేతగా ఎదుగుతారు అని చూసి రివ్యూ చెప్పడం అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్( Tollywood ) హీరోలు శుక్రవారం నీ ఒక బిజినెస్ యాంగిల్ లో వాడుకుంటున్నారు.ప్రతి శుక్రవారం వచ్చేసి సినిమాలకు సంబంధించి కొంతమంది హీరోలు ఎప్పుడూ ట్విట్టర్లో తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ వస్తున్నారు.
తద్వారా వారి అభిమానులు ఆ సినిమాకు సపోర్ట్ చేస్తారని ఆలోచనతో హీరోలంతా కూడా ఇలా విడుదలవుతున్న సినిమాలకు ట్వీట్లు చేయడం ప్రారంభించారు.

అయితే ఏ సినిమాకైనా పక్క హీరో ఎందుకు ప్రమోషన్ చేస్తారు.ఫ్రీగా వారి సినిమాలు ప్రమోట్ చేస్తే వచ్చే లాభమేంటి అని అనుకుంటున్నారా ? ఫ్రీగా ప్రమోట్ చేయడం లేదండి బాబు.సినిమా( movie ) కోసం ట్వీట్లు వేయడానికి వారు డబ్బులు లేదా మరొక రూపంలో లాభం పొందుతారు కాబట్టే ఇక పక్క హీరోల సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు.
అయితే మామూలు హీరోలు ఇలా పక్క భాషల లేదా పక్క హీరోల సినిమాలను ప్రమోట్ చేయడం వరకు ఓకే కానీ మహేష్ బాబు లాంటి హీరో సైతం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అస్సలే మహేష్ బాబు కి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కాస్త నెగిటివ్ పబ్లిసిటీ పెంచుకుంటున్నాడు.అయితే నిన్న విడుదలైన మేము ఫేమస్( memu famous )అనే సినిమాకు ఫస్ట్ షోకే కామెంట్ చేయడం పట్ల అందరూ సర్వత్రా విమర్శిస్తున్నారు.అసలు విడుదలైంది, ఎప్పుడు సినిమా వచ్చింది, ఎప్పుడు చూసావు ఎందుకిలా పక్క సినిమా ప్రమోషన్ చేస్తారు.
సినిమా బాగుందో లేదో చూసి చెప్తే బాగుంటుంది కదా అంటూ మహేష్ బాబు నేను ఏకీపారేస్తున్నారు.