హనుమాన్ టీజర్‌.. ఈ విషయంలో కూడా ఆదిపురుష్ కంటే ముందే

తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న హనుమాన్ సినిమా యొక్క టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.టీజర్‌ విడుదలకు ముందు చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమాను పాన్ ఇండియా సినిమా అంటూ ప్రచారం చేస్తూ ఉంటే కొందరు ముక్కున వేలేసుకున్నారు.

 Teja Sajja Hanuman Film Teaser Views , Adipurush, News In Telugu, Prashanth Varm-TeluguStop.com

కానీ ఇప్పుడు మాత్రం తేజా సజ్జా నటించిన ఈ సినిమా కచ్చితంగా పాన్‌ ఇండియా సినిమా అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము రేపడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హనుమాన్ టీజర్‌ నిజంగా విభిన్నంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా భారీ గా ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశం ఉందట.

Telugu Adipurush, Telugu, Prashanth Varma, Teja Sajja-Movie

తేజ సజ్జా కు జోడీగా ఈ సినిమా లో అమృత అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తోంది.ఇక తమిళ స్టార్‌ హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌ కుమార్ ఈ సినిమా యొక్క కథలో అత్యంత కీలక పాత్ర పోషించడం జరిగింది.దాంతో ఈ సినిమా తమిళనాట కూడా మంచి బజ్ క్రియేట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.ఆదిపురుష్ టీజర్ తో పోల్చితే ఈ సినిమా యొక్క టీజర్ అద్భుతంగా ఉంది అంటూ చాలా మంది ప్రశంసలు కురిపించారు.

ఆదిపురుష్‌ యొక్క టీజర్‌ తో పోల్చితే హనుమాన్‌ యొక్క టీజర్‌ అత్యధిక వ్యూస్ ను రాబట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.హనుమాన్‌ కథ ఏంటీ అనే విషయంలో ఎలాంటి లీక్ లేదు.

టీజర్ తో కూడా క్లారిటీ ఇవ్వలేదు.అయినా కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

హలీవుడ్‌ సూపర్ స్టార్స్ తో పోల్చితే మన హనుమాన్ అత్యంత బలమైన సూపర్ మ్యాన్‌.కనుక ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube