Liver Detox Drink : లివర్ శుభ్రంగా మరియు హెల్తీ గా ఉండాలంటే తప్పకుండా డైట్ లో దీన్ని చేర్చుకోండి!

ఇటీవల కాలంలో లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, మద్యపానం తదితర కారణాల వల్ల లివర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది.

 It Is A Super Drink That Keeps The Liver Clean And Healthy , Super Drink, Liver-TeluguStop.com

వాస్తవానికి మన శరీరంలో అతి పెద్ద అవయవం లివర్.అలాగే మన శరీరంలో ఎన్నో పనులు లివర్ నిర్వహిస్తూ ఉంటుంది.

అటువంటి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.

అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్ లో కనుక చేర్చుకుంటే మీ లివర్ శుభ్రం అవ్వడమే కాదు హెల్తీగా సైతం మారుతుంది.

మరి ఇంతకీ లివ‌ర్ ఆరోగ్యానికి ఉపయోగపడే ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు ఆప్రికాట్స్, వన్ టేబుల్ స్పూన్ నల్ల ఎండు ద్రాక్ష వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మ‌రుసటి రోజు ఉదయాన్నే నానబెట్టుకున్న ఆప్రికాట్స్ మరియు నల్ల ఎండుద్రాక్షలను మిక్సీ జార్ లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న‌ ఆప్రికాట్స్, నల్ల ఎండుద్రాక్షల మిశ్రమాన్ని వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు టేబుల్ స్పూన్ లవంగాల పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Tips, Healthy Liver, Latest, Liver, Liver Detox-Telugu Health Tips

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ ను మిక్స్ చేస్తే మన డ్రింక్‌ సిద్దమవుతుంది.ప్రతిరోజు ఉదయాన్నే ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే లివర్ లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.లివర్ శుభ్రంగా మరియు హెల్తీ గా మారుతుంది.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల వివిధ రకాల లివర్ సంబంధిత సమస్యలు సైతం ద‌రిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube