సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరోలు హీరోయిన్లు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.ఇలా ఇండస్ట్రీలో హీరోలుగా తమ శరీర ఫిట్నెస్ ఉంచుకోవడం కోసం పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటారు.
అలాగే ఎక్కువగా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ ఉంటారు.అయితే అప్పట్లో ఇలాంటి జిమ్ లు ఉండేవి కాదు అదే విధంగా ఓకే రోజే రెండు మూడు షిఫ్టులలో సినిమా షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా ఉండేవారు.
దీంతో కనీసం వారికి వ్యాయామం చేసే సమయం కూడా ఉండేది కాదు అయినప్పటికీ వారి శరీర ఫిట్నెస్ ను ఎంతగానో కాపాడుకునేవారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోగా ఇంత పేరు ప్రఖ్యాతలు పొందిన సూపర్ స్టార్ కృష్ణ సైతంరోజుకు మూడు షిఫ్టులలో పనిచేస్తూ తన శరీర ఫిట్నెస్ ను కాపాడుకున్నారు.
అయితే ఈయన తనకి ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలను తింటూనే తన శరీర ఫిట్నెస్ ఫై దృష్టి సారించేవారు.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు పొందిన కృష్ణ నవంబర్ 15వ తేదీ తుది శ్వాస విడిచారు.
ఈ క్రమంలోనే గూఢచారి 117 సినిమా రచయిత తోటపల్లి మధు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణ ఆహారపు అలవాట్లు గురించి వెల్లడించారు.
కృష్ణ గారు షూటింగ్ ఉంటే కనుక ఇంటిలోనే తన టిఫిన్ కార్యక్రమాలన్నింటిని పూర్తిచేసుకుని లొకేషన్లోకి వచ్చేవారు.ఇక లొకేషన్ లో షూటింగ్ సమయంలో బిజీగా ఉన్న ఈయన 11 గంటలకు తప్పనిసరిగా పెరుగు వడ తినేవారు.కృష్ణ గారు షూటింగ్లో ఉన్నారంటే 11 గంటలకు తప్పనిసరిగా పెరుగు వడ ఉండాల్సిందే.
ఇక మధ్యాహ్నం ఒంటిగంటకు తప్పనిసరిగా ఈయన భోజనం చేస్తారు అయితే భోజనంలో ఈ ఆహార పదార్థాలే ఉండాలి అనే నియమం లేదు.ఇక మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తప్పనిసరిగా సున్నుండలు ఉండాల్సిందే.
అలాగే ఐదు గంటలకు గోధుమ రవ్వతో తయారు చేసిన దోసెలు ప్రత్యేకంగా హోటల్ నుంచి తెప్పించేవారు.ఇలా కృష్ణ గారు షూటింగ్లో ఉన్నారంటే ఈ ఆహార పదార్థాలు ప్రతిరోజు తప్పకుండా ఉండాల్సిందేనని రచయిత తోటపల్లి మధు కృష్ణ ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు.