ఈ మధ్యకాలంలో చాలామంది తమ ఇళ్లలో చాలా రకాలు పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు.చాలా ఎక్కువ మంది పెంచుకునే పెంపుడు జంతువులలో కుక్కలు మొదటి స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు.
పెద్ద పెద్ద నగరాలలో అయితే ప్రతి ఇంట్లోనూ కుక్కల్ని పెంచుకుంటూ వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు.మరి కొంతమంది ప్రపంచంలో చాలా అరుదైన కుక్క జాతికి చెందిన కుక్కలను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు.
వాటిని కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తూ వాటికి రకరకాల డ్రస్సులు, మంచి ఆహారం తినిపించడం లాంటివి చేస్తూ ఉంటారు.
ఇలాంటి కుక్కలను విరందరూ కొన్ని లక్షలలో ఖర్చుపెట్టి కొని తెచ్చుకుంటూ ఉంటారు.
అట్లాగే వాటికి ఆరోగ్యం బాగా లేకపోయినా హాస్పటల్ కి తీసుకువెళ్లి తగిన చికిత్సలు చేస్తూ ఉంటారు.అయితే ఇంట్లో కుక్క పిల్లలు లేదా కుక్కలు ఉంటే ఆ సందడి వేరుగా ఉంటుంది.
ఇంట్లో చిన్న కుక్క పిల్లలు ఉంటే ఆ ఇల్లు అంతా సందడి సందడిగా ఉంటుంది.ఆ చిన్న కుక్క పిల్లలు చేసే పనులు ఒక్కసారి నవ్వును తెప్పిస్తుంటాయి.
మరికొన్నిసార్లు ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు తెలివిగా కూడా ప్రవర్తిస్తుంటాయి.
ఇలా పెంపుడు జంతువులు తెలివిగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో ఒక కుక్క పిల్ల, ఒక వృద్ధురాలు ఉన్నారు.
ఈ వీడియోలో వృద్ధురాలు కూర్చోవాలి అని ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో పక్కనే ఉన్న ఒక కుక్కపిల్ల ఆమె కూర్చోవడానికి పక్కనే ఉన్న స్టూల్ ని సరిగ్గా కిందికి జరుపుతోంది.అలా ఆ చిన్న కుక్క పిల్ల స్టూల్ ని జరిపి ఆ వృద్ధురాలికి సహాయం చేస్తుంది.
దాని తెలివితేటలకు నెటిజన్స్ ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు.