కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార విగ్నేష్ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలారు.
ఇదే వీరిద్దరూ మొదట్లో ప్రేమించుకున్న విషయం కూడా చాలా రోజులపాటు గోప్యంగా ఉంచారు.తర్వాత వారు ప్రేమించుకుంటున్నట్లు కన్ఫామ్ అవడంతో ఆ తర్వాత చెట్టాపట్టాలేసుకొని ఎక్కడికి వెళ్లినా కలిసి తిరిగారు.
అలా ఎట్టకేలకు ఈ జంట ఈ ఏడాది మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.ఇకపోతే ఇటీవల ఈ జంట తల్లిదండ్రులు అయిన విషయం కూడా తెలిసిందే.
అయితే నయనతార, విగ్నేష్ శివన్ అభిమానులకు వారి ప్రేమ కథ గురించి వారి ప్రేమ ఎలా మొదలైంది అన్న విషయాల గురించి తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.
వీరిద్దరి పరిచయం ఎక్కడ ఏర్పడింది? ఏ సినిమాతో ఏర్పడింది.ఇప్పుడు ప్రేమలో పడ్డారు? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.నయనతార విగ్నేష్ శివన్ లు ఏడేళ్ల పాటు ప్రేమించుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించారు.వీరిద్దరి కాంబినేషన్లో 2015 లో వచ్చిన సినిమా నానుమ్ రౌడీ ధాన్.2015 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.కాగా ఈ సినిమా విడుదల అయ్యి నేటికి ఏడేళ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.నానుమ్ రౌడీ ధాన్ సినిమా షూటింగ్ సందర్భంగా మొదటిసారి విగ్నేష్ శివన్ నయనతారను కలిశారట.
ఇక అప్పటి నుంచి వీరి లవ్ స్టోరీ మొదలైంది.నానుమ్ రౌడీ ధాన్ సినిమాలో హీరోయిన్గా మొదటి నయనతారను కాకుండా వేరే హీరోయిన్ ఎంపిక చేశారట.కానీ ఆ తర్వాత ఒకరోజు హోటల్లో నయనతారను విగ్నేష్ కలుసుకోవడంతో ఈ సినిమాకు ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారట.సినిమా విడుదల ఏడేళ్లు అయిన సందర్భంగా విగ్నేష్ శివన్ సెట్స్ లో ఉండే వీడియోని పంచుకున్నారు.
ఆ వీడియోలు విగ్నేష్ డైరెక్షన్ చేస్తూ మాట్లాడుతూ ఉండగా అందరూ పక్కన నవ్వుతూ ఉన్నారు.పక్కనే నయనతార కూడా నవ్వుతూ కనిపిస్తోంది.కాగా ఎందుకు సంబంధించిన వీడియోని విగ్నేష్ షేర్ చేస్తూ ఒకప్పుడు పాండీవుడ్ లో అంటూ క్యాప్షన్ జోడించాడు.ఇక ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
ఎట్టకేలకు ఆ గాసిప్స్ ని నిజం చేస్తూ ఈ జంట ఈ ఏడాది మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.